Pat Cummins : జ‌ట్టుతోనే ఉంటా.. కానీ ఇప్ప‌ట్లో ఆడ‌ను.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు..

గ‌త కొంత‌కాలంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ (Pat Cummins) వెన్ను గాయంతో బాధ‌ప‌డుతున్నాడు.

Pat Cummins says he not playing IPL 2026 first phase

  • వెన్నుగాయంతో బాధ‌ప‌డుతున్న పాట్ క‌మిన్స్‌
  • ఐపీఎల్ 2026లో తొలి అర్థ‌భాగానికి దూరం
  • అన్నీ అనుకూలిస్తే రెండో అర్థ‌భాగంలో బ‌రిలోకి

Pat Cummins : గ‌త కొంత‌కాలంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ వెన్ను గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ గాయం నుంచి అత‌డు పూర్తిగా కోలుకోలేదు. అయిన‌ప్ప‌టికి కూడా బెంగ‌ళూరుకు చేరుకున్న అత‌డు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో క‌లిసి ప్రాక్టీస్ సెష‌న్ల‌లో పాల్గొంటున్నాడు. ఈ క్ర‌మంలో క‌మిన్స్ (Pat Cummins) మాట్లాడుతూ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్ తొలి అర్థ‌భాగంలో తాను ఆడ‌న‌ని స్ప‌ష్టం చేశాడు. రెండో అర్థ‌భాగంలో ఆడే అవ‌కాశం ఉంద‌న్నాడు.

తాను వెన్నుగాయం నుంచి కోలుకుంటున్నాన‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం అంతా బాగానే ఉంద‌న్నాడు. తాను నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. త్వ‌ర‌లో ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. ‘అయితే.. ఆరంభ మ్యాచ్‌ల్లో నేను ఆడ‌లేను. అంతా స‌వ్యంగా జ‌రిగితే.. టోర్నీ మ‌ధ్య‌లో అంటే రెండో అర్థ‌భాగం, ఫైన‌ల్ మ్యాచ్‌ల్లో ఆడ‌తాను. ‘అని క‌మిన్స్ అన్నాడు.

SRH : ఉప్ప‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌.. ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల నుంచే టికెట్ల బుకింగ్‌.. ఎక్క‌డ కొనుగోలు చేయాలంటే?

ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇప్ప‌టికే రెండు జ‌ట్లు బెంగ‌ళూరు చేరుకుని ప్రాక్టీస్‌లో నిమ‌గ్నం అయ్యాయి.

ఇక పాట్ క‌మిన్స్ దూరం కావ‌డంతో ఇషాన్ కిష‌న్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు తాత్కాలిక సార‌థిగా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌నున్నాడు. అభిషేక్ శ‌ర్మ వైస్ కెప్టెన్‌గా నియ‌మితుల‌య్యాడు. ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఇషాన్ నాయ‌క‌త్వంలోనే స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది.