SRH : ఉప్పల్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్.. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచే టికెట్ల బుకింగ్.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే?
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)హోం గ్రౌండ్ అయిన ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ సేల్స్ ఈరోజు ప్రారంభం కానున్నాయి.
IPL 2026 SRH vs LSG match tickets sales starts today evening 5pm
- ఉప్పల్‌లో ఏప్రిల్ 5న ఐపీఎల్ మ్యాచ్
- సన్‌రైజర్స్‌తో తలపడనున్న లక్నో
- నేటి సాయంత్రం నుంచి ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు
SRH : ఐపీఎల్ 2026 సీజన్ శనివారం (మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ సేల్స్ ఈరోజు ప్రారంభం కానున్నాయి.
ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. రెండు టికెట్లు కొంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీని ఉచితంగా ఇవ్వనున్నారు.
Set your alarms, Orange Army ⏰🔥
Get your tickets for our first home match today on @district_india pic.twitter.com/I1ToApo2aJ
— SunRisers Hyderabad (@SunRisers) March 26, 2026
కాగా.. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు కారణంగా బీసీసీఐ ఐపీఎల్లో తొలి 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌నే విడుదల చేసింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ తొలి విడుత షెడ్యూల్లో హోం గ్రౌండ్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. అది ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను సాయంత్రం 5 గంటల నుంచి డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్‌లో కొనుగోలు చేయవచ్చు.
