Punjab Kings : ఆర్‌సీబీ, సీఎస్‌కే ప్ర‌పంచ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన పంజాబ్ కింగ్స్‌.. ఐపీఎల్‌లోనే ఏకైక జ‌ట్టు

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అద‌ర‌గొడుతోంది.

PBKS Achieve Huge Feat Vs MI At Wankhede Stadium (pic credit@ipl)

  • వాంఖ‌డేలో పంజాబ్ అరుదైన ఘ‌న‌త‌
  • ముంబై పై అత్య‌ధిక మ్యాచ్‌లు గెలిచిన జ‌ట్టుగా

Punjab Kings : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ మ‌రో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. గురువారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో పంజాబ్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో ఓట‌మే ఎరుగ‌ని జ‌ట్టుగా నిలిచింది.

కాగా.. ముంబై పై విజ‌యంతో పంజాబ్ కింగ్స్ ఓ భారీ ఘ‌న‌త‌ను సాధించింది. ముంబై పై ఈ ఘ‌న‌త సాధించిన తొలి జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్ర‌లో వాంఖ‌డే మైదానంలో ముంబై ఇండియ‌న్స్ పై అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్టుగా నిలిచింది. ఆరు సార్లు ఈ మైదానంలో పంజాబ్ జ‌ట్టు ముంబై జ‌ట్టును ఓడించింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో మ‌రే జ‌ట్టు కూడా ముంబైని వాంఖ‌డేలో ఇన్ని సార్లు ఓడించ‌లేదు. చెన్నై సూప‌ర్ కింగ్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు చెరో ఐదు సార్లు ముంబైని వాంఖ‌డే మైదానంలో ఓడించాయి.

వాంఖ‌డేలో ముంబై పై అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్లు ఇవే..

* పంజాబ్ కింగ్స్ – 11 మ్యాచ్‌ల్లో 6 విజ‌యాలు
* చెన్నై సూప‌ర్ కింగ్స్ -13 మ్యాచ్‌ల్లో 5 విజ‌యాలు
* రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – 13 మ్యాచ్‌ల్లో 5 విజ‌యాలు
* రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – 9 మ్యాచ్‌ల్లో 4 విజ‌యాలు

also read : వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో ఓట‌మి.. ప్లేఆఫ్స్‌కు ముంబై ఎలా అర్హ‌త సాధించ‌వ‌చ్చో తెలుసా?

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ముంబై పై పంజాబ్ జ‌ట్టు 18 సార్లు విజ‌యాలు సాధించింది. ఈ క్ర‌మంలో లీగ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు ఎంఐ పై విజ‌యం సాధించిన జ‌ట్టుగా సీఎస్‌కేతో క‌లిసి పంజాబ్ అగ్ర‌స్థానంలో నిలిచింది.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఎంఐ పై అత్య‌ధిక సార్లు విజ‌యం సాధించిన జ‌ట్లు ఇవే..

* పంజాబ్ కింగ్స్ – 35 మ్యాచ్‌ల్లో 18 విజ‌యాలు
* చెన్నై సూప‌ర్ కింగ్స్ – 39 మ్యాచ్‌ల్లో 18 విజ‌యాలు
* ఢిల్లీ క్యాపిట‌ల్స్ – 38 మ్యాచ్‌ల్లో 17 విజ‌యాలు
* రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు- 35 మ్యాచ్‌ల్లో 16 విజ‌యాలు
* రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – 31 మ్యాచ్‌ల్లో 15 విజ‌యాలు

గురువారం మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 195 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాటర్ల‌లో క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్) శ‌త‌కం బాద‌గా.. న‌మ‌న్ ధీర్ (50) హాఫ్ సెంచ‌రీ చేశాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు, మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ లు చెరో వికెట్ సాధించారు.

also read : నేటి నుంచే భార‌త్, ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల టీ20 సిరీస్‌.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

196 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ జ‌ట్టు 16.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (80 నాటౌట్ ), శ్రేయ‌స్ అయ్య‌ర్ (66) హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ముంబై బౌల‌ర్ల‌లో ఘజన్‌ఫర్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.