Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంవేళ తప్పును సరిదిద్దుకున్న పాక్.. కరాచీ స్టేడియంలో భారత జెండా

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన తప్పును సరిదిద్దుకుంది.. కరాచీ స్టేడియంలో భారత జెండాను ఆవిష్కరించింది.

Champions Trophy 2025

Champions Trophy 2025: వన్డేల్లో ప్రపంచ కప్ తరువాత అత్యంత ఆసక్తి రేకెత్తించే, రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. పాకిస్థాన్ ఆతిథ్యంలో జరిగే ప్రతిష్టాత్మక టోర్నీఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, టోర్నీ ప్రారంభం వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దిగొచ్చింది. తన తప్పును తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా కరాచీ స్టేడియంలో ఇండియా ప్లాగ్ ను ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ప్రారంభం నేడే.. పూర్తి షెడ్యూల్, ఫ్రైజ్ మనీ.. ప్రత్యక్ష ప్రసారం వివరాలతోసహా..

రెండురోజుల క్రితం కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. కరాచీ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించగా.. అందులో భారత పతాకం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీబీ తీరును తీవ్రంగా ఖండించారు. అయితే, పీసీబీ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. తద్వారా ఇండియాను అవమానపర్చే విధంగా ప్రవర్తించింది.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాకిస్థాన్ మధ్య ఆ రోజు మ్యాచ్‌.. హర్భజన్ సింగ్ హెచ్చరిక..

‘‘ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ లు ఆడేందుకు పాకిస్థాన్ కు భారత్ రావట్లేదు. కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాల్లో మ్యాచ్ లు ఆడుతున్న జట్ల జెండాలను మాత్రమే స్టేడియంపై ప్రదర్శించాం. భారత్ తన మ్యాచ్ లను దుబాయ్ లో ఆడుతుంది. బంగ్లాదేశ్ ఇంకా పాకిస్థాన్ రాలేదు. అందుకే ఆ రెండు దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలను ప్రదర్శించలేదని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పాకిస్థాన్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అవుతున్న వేళ పాకిస్థాన్ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది.

తాజాగా కరాచీ స్టేడియంలో భారత జాతీయ జెండాను ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై వస్తున్న విమర్శలకు పుల్ స్టాప్ పెట్టింది. అయితే, ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అవుతుండగా.. తొలి మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ నెల 23న పాకిస్థాన్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య దుబాయ్ వేదిగా మ్యాచ్ జరగనుంది.