Chris Cairns: ఆర్థిక కష్టాల్లో క్రికెటర్ కెయిన్స్.. అతడి జీవితం నేర్పే పాఠాలు..!

డబ్బులు తెగ ఖర్చు పెట్టేస్తున్నారా? డబ్బులు ఆదా చేయలేకపోతున్నారా? పెట్టుబడి పెట్టాలా? దాచుకోవాలో తెలియక సతమతమవుతున్నారా?

Chris Cairns: ఆర్థిక కష్టాల్లో క్రికెటర్ కెయిన్స్.. అతడి జీవితం నేర్పే పాఠాలు..!

From Riches To Rags Personal Finance Lessons From Chris Cairns’ Troubled Life

Updated On : August 15, 2021 / 7:19 PM IST

Personal finance lessons from Chris Cairns Life : డబ్బులు తెగ ఖర్చు పెట్టేస్తున్నారా? డబ్బులు ఆదా చేయలేకపోతున్నారా? పెట్టుబడి పెట్టాలా? దాచుకోవాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే చేతుల్లో డబ్బు ఉన్నప్పుడే అవసరానికి తగినట్టుగా ఖర్చు చేయాలి. లేదంటే ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోవాల్సిందే.. జీవితంలో డబ్బుల ఎంత అవసరమో? ఆర్థిక కష్టాలు ఎలా ఉంటాయో తెలియాలంటే న్యూజిలాండ్ క్రికెటర్ గురించి ముందుగా తెలుసుకోవాల్సిందే.. అతడే.. క్రిస్ కెయిన్స్ (Chris Cairns). ఇప్పటి యువ తరానికి పెద్దగా ఈ పేరు తెలియకపోవచ్చు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టార్ క్రిస్ కెయిన్స్ అంటే భారతీయ క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఇతడ్నీ మన తెలుగువాళ్లు కెన్ మామ అని ముద్దుగా పిలుస్తారు. ఒకప్పుడు బ్యాట్, బాల్ తో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కెన్.. ఇప్పుడు ఆర్థిక కష్టాలతో పోరాడుతున్నాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కెన్ ఆస్ట్రేలియాలో ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్నాడు. ఇప్పుడీ ఈ ఆల్ రౌండర్ క్రికెటర్లలో ఒకడైన కెన్ నిజ జీవితంలో ఎదురైన ఆర్థిక కష్టాల నుంచి జీవిత పాఠాలను నేర్చుకోవాల్సిందే..

Chris Cairns’ Troubled Life

క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్‌ కెయిన్స్‌ జీవితం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. రిటైర్‌ అయ్యాక విలాసాలకు బానిసయ్యాడు. అంతా పోగట్టుకుని ఇప్పుడు రోడ్డున బస్సులు కడిగే స్థాయికి చేరుకున్నాడు. కనీసం ఆస్పత్రిలో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. హాలీవుడ్‌ హీరోలా కనిపించే కెన్.. మీడియం పేస్‌తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. గాయాలతో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ కెరీర్‌ వెనుకపడింది. వయసు ఉండగానే 2006లో రిటైర్‌మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు డబ్బుల్లేక చందాలు అడుగుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.

Chris Cairns

కెయిన్స్ చేసిన తప్పు ఇదేనా? :
ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే క్రిస్‌ కెయిన్స్‌ జీవితాన్ని నాశనం చేసింది. జల్సాలకు అలవాటుపడి సంపాదించిన మొత్తాన్ని పొగట్టుకున్నాడు. హుందాగా బతికిన కెయిన్స్‌ ఇప్పుడు బస్సులు కడిగే క్లీనర్‌ స్థితికి చేరుకున్నాడు. గంటకు 17 డాలర్లు సంపాదించిన అతడి జీవితం.. ఇప్పుడు చందాలతో బతకాల్సిన ధీనపరిస్థితికి దిగజార్చింది. ఈ క్రమంలోనే గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు. ట్రీట్‌మెంట్‌ కోసం దాతల కోసం చేతులు చాసేపరిస్థితి వచ్చింది. మూడున్నర క్యారెట్ల వజ్రాల రింగుతో ప్రపోజ్‌ చేసిన భర్త.. ఇప్పుడు ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న వైనం చూసి అతడి భార్య మెలనీ జీర్ణించుకోలేకపోతోంది.

Cris

కెయిన్స్‌ వజ్రాల వ్యాపారిగా ఓక్టగాన్‌ కంపెనీని స్థాపించి లాభాలు ఆర్జించాడు. డబ్బుని ఆదా చేయలేకపోయాడు. అదనపు ఖర్చులతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అవసరానికి మించి కొని అప్పుల్లో కూరుకుపోయాడు. విలాసాలకు అలవాటుపడ్డాడు. అడ్డగోలుగా ఖర్చు పెట్టాడు. చివరికి అప్పుల పాలయ్యాడు. భారీ నష్టాలతో డైమండ్‌ కంపెనీ మూసేశాడు. సంపాదించిన డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేశాడు. ఫలితంగా కనీసం ఇన్సురెన్స్‌ కూడా చేయించుకోలేకపోయాడు. ఆస్పత్రి వైద్య ఖర్చులకు కూడా మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితికి చేరుకున్నాడు.

Carins

కెయిన్స్ జీవితమే పాఠం :
ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఎంత సంపాదిస్తున్నామనేది కాదు.. ఎంత ఆదా చేస్తున్నామనేది ముఖ్యమంటున్నారు. కూర్చొని తింటుంటే కొండైన కరిగిపోతుందనడానికి కెయిన్స్ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. డబ్బు సంపాదించడం కంటే.. పొదుపు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఆ పని కెయిన్స్ చేయలేకపోయాడు. అందుకే ఆర్థిక కష్టాల్లోకి జారుకున్నాడు. జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు. సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టాలంటారు. అది ఆ డబ్బును మరింత పెంచేలా చేస్తుంది. అందుకు చాలా ఓపిక సహానం ఉండాలి. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలంటే కుదరని పని.. కొంచెంకొంచెంగా పొదుపు చేస్తూ పోవాలి. అప్పుడే దీర్ఘకాలంలో మీ ధనం రెట్టింపు అవుతుంది. డబ్బు ఖర్చుపెట్టడం చాలా సులభం.. క్షణాల్లో ఖర్చుపెట్టేయొచ్చు… కానీ, సంపాదించాలంటే చాలా సమయం కావాలి. ఆదాయానికి తగినట్టుగా పెట్టుబడులు పెట్టాలి. ఈ విషయంలో కెయిన్స్ తప్పటడుగు వేశాడు. జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.