Players with the most runs in international cricket Root overtook Brian Lara
Joe Root : గత కొన్నాళ్లుగా భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ శ్రీలంకతో మూడో వన్డేలో శతకంతో చెలరేగిపోయాడు. 108 బంతులు ఎదుర్కొన్న రూట్ 9 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజాలు ఆటగాళ్లు ఉన్న ఎలైట్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.
వన్డేల్లో రూట్‌కు ఇది 20వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి ఇది 61వ శతకం. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి రూట్ ఇప్పటి వరకు 22,413 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాను అధిగమించి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో 34,357 పరుగులతో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో కలిపి) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 34,357 పరుగులు
* విరాట్ కోహ్లీ (భారత్) – 28,215 పరుగులు
* కుమార్ సంగక్కర (శ్రీలంక) – 28,016 పరుగులు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 27,483 పరుగులు
* మహేల జయవర్ధనే (శ్రీలంక) – 25,957 పరుగులు
* జాక్వస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) – 25,534 పరుగులు
* రాహుల్ ద్రవిడ్ (భారత్) – 24,208 పరుగులు
* జోరూట్ (ఇంగ్లాండ్) – 22,413 పరుగులు
* బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 22,358 పరుగులు
ఇక ఇంగ్లాండ్, శ్రీలంక మూడో వన్డే విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 53 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
IND vs NZ : విశాఖ వేదికగా నేడు నాలుగో టీ20 మ్యాచ్.. సంజూ శాంసన్ పైనే అందరి కళ్లు..
జోరూట్ (111 నాటౌట్; 108 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (136 నాటౌట్; 66 బంతుల్లో 11 ఫోర్లు, 9 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పవన్ రాత్నాయక్ (121; 115 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినప్పటికి 358 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 46.4 ఓవర్లలో 304 పరుగులకే పరిమితమైంది.