ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన నరేంద్రమోదీ స్టేడియం చేరుకుని.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ను తిలకించనున్నారు.
#WATCH | PM Narendra Modi arrived at Ahmedabad Airport; Gujarat.
(Visuals from earlier today) #ICCCricketWorldCup #IndiaVsAustralia pic.twitter.com/aiqkwKcfqj
— ANI (@ANI) November 19, 2023
కీలక మ్యాచులో భారత బ్యాటర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా ముందు ఓ మోస్తరు లక్ష్యం నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (54; 63 బంతుల్లో 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (66; 107 బంతుల్లో 1 ఫోర్) లు హాఫ్ సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. మిగిలిన వారు విఫలం కావడంతో ఓ మోస్తరు స్కోరుకే భారత్ పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు. మాక్స్‌వెల్, జంపాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.