Mumbai Indians : రోహిత్ శర్మ ఎంట్రీ.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్ వర్మ..! జట్టు నుంచి హార్డిక్ ఔట్?
Mumbai Indians : వచ్చే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు సత్తాచాటేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
- Harish Thanniru
- Published on- September 1, 2026 / 09:20 PM IST
Mumbai Indians
Mumbai Indians : ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. హార్డిక్ పాండ్య సారథ్యంలో ఆ జట్టు ఘోరంగా వైఫల్యం చెందింది. అయితే, వచ్చే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు సత్తాచాటేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
కెప్టెన్ గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబయి కసరత్తు చేస్తోందని సమాచారం. ఆ బాధ్యతలను రోహిత్ శర్మ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని.. ఈ క్రమంలో అతను రెండు పేర్లను జట్టు యాజమాన్యంకు సూచించినట్లు సమాచారం. అందులో సీనియర్ ప్లేయర్ జస్ర్పీత్ బుమ్రా, యువ ఆటగాడు తిలక్ వర్మ. అయితే, బుమ్రా కంటే తిలక్ వర్మవైపు జట్టుయాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తేనే బాగుంటుందని రోహిత్ శర్మతోపాటు జట్టు యాజమాన్యం సైతం భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రాబోయే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తిలక్ వర్మ బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరోవైపు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంలో ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ చర్చల్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ను డీల్‌లో భాగంగా తీసుకునే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గ్రీన్ వర్క్‌లోడ్‌పై ఆందోళనల కారణంగా ముంబై ఆ ప్రతిపాదనపై ఆసక్తి చూపలేదని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో హార్దిక్‌ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబయి భావిస్తోందట.
