Preity Zinta Reaction To MS Dhoni First Ball Duck
Preity Zinta Reaction : ప్లే ఆఫ్స్ దిశగా చెన్నై సూపర్ కింగ్స్ మరో అడుగు ముందుకు వేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్ పై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (26 బంతుల్లో 43), రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 32), డారిల్ మిచెల్ (19 బంతుల్లో 30) లు రాణించారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ లు చెరో మూడు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కర్రాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. ప్రభసిమ్రాన్ సింగ్ (23 బంతుల్లో 30), శశాంక్ సింగ్ (20 బంతుల్లో 27) లు ఫర్వాలేదనిపించారు. సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్ పాండే, సిమర్‌జీత్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశాడు. మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ లు ఒక్కొ వికెట్ సాధించారు.
RCB : ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జరగాల్సిందే
కాగా.. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని విఫలం అయ్యాడు. ఈ సీజన్‌లో మెరుపులు మెరిపిస్తున్న ధోని తొలి బంతికే డకౌట్ అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ధోని డకౌట్ కావడంతో పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రాన్‌తో పాటు ప్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తలా ఔట్ కావడంతో సీఎస్‌కే అభిమానులు సైలెంట్ కాగా.. ప్రీతి జింటా మాత్రం తన సీట్‌లోంచి లేచి నిలబడి మరీ చప్పట్లో ఆటగాళ్లను అభినందించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ప్రీతి జింటా ఇలా చేస్తుందని అనుకోలేదు కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Dinesh Karthik : కాఫీ కూడా తాగనివ్వలేదురా అయ్యా.. ఆర్‌సీబీ వికెట్ల పతనం పై దినేశ్ కార్తీక్
Full highlight of MS DHONI’s greatest knock, 0(1). pic.twitter.com/FrlDKHKE5H
— bitch (@TheJinxyyy) May 5, 2024