ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠభరితమైన పోరులో ఎట్టకేలకు 2వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ(56) పరుగుల చేసి శుభారంభాన్ని అందించాడు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన షా.. అండర్-19 సహచరుడైన శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేశాడు.
ఐపీఎల్ 2019లో 4వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్ కెరీర్లోనే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన టీనేజర్‌గా రికార్డు ఉన్న గిల్‌తో సమమైయ్యాడు. గిల్.. కోల్‌కతా చివరి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడి 49 బంతుల్లో 65పరుగులు చేశాడు.
అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన టీనేజర్లు:
శుభ్‌మన్ గిల్/పృథ్వీ షా 4
సంజూ శాంసన్/రిషబ్ పంత్/ ఇషాన్ కిషన్ 3
గోస్వామి/ మనీశ్ పాండే/ దీపక్ హుడా/ రియాన్ పరాగ్ 1
Leading the run chase and how ?? pic.twitter.com/okcE0FOD2N
— IndianPremierLeague (@IPL) 8 May 2019
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 8వికెట్లు నష్టపోయి 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ(56), వికెట్ కీపర్ రిషబ్ పంత్(49)చెలరేగడంతో టార్గెట్ సులువైపోయింది.