×
Ad

Prithvi shaw : గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా రొమాన్స్‌.. ఆ దేవుడు రాసిన స్ప్రిప్ట్ అంటూ వీడియో పోస్ట్..

పృథ్వీ షా (Prithvi shaw) త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ఆకృతితో క‌లిసి చేసిన రీల్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

Prithvi shaw Shares nice post for girlfriend video viral

Prithvi shaw : ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు టీమ్ఇండియా ఆట‌గాడు పృథ్వీ షా ఓ వీడియోను త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ వీడియోలో అత‌డి ప్రియురాలు ఆకృతి అగ‌ర్వాల్ సైతం ఉంది.

ఆకృతి, పృథ్వీ (Prithvi shaw) క‌లిసి చేసిన రీల్ చాలా బాగుంది. ఇక ఈ వీడియోలో పృథ్వీ చాలా ఉల్లాసంగా, ఆనందంగా క‌నిపిస్తున్నాడు. ఇక ఆమెను క‌ల‌వ‌డం దేవుడు చేసిన ప్లాన్ అంటూ అత‌డు చెప్పాడు.

WPL 2026 : ఆమె లేక‌పోతే గెలిచేవాళ్లం కాదు.. ఆ రెండు పాయింట్లు.. స్మృతి మంధాన కామెంట్స్‌..

ప్ర‌స్తుతం పృథ్వీ షా విజ‌య్ హ‌జారే ట్రోఫీ ఆడుతున్నాడు. రౌండ్ 6 మ్యాచ్ అనంత‌రం త‌న‌కు దొరికిన విరామాన్ని అత‌డు ఎంతో ఆస్వాదిస్తున్నాడు. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ఆకృతితో క‌లిసి బీచ్ ఒడ్డున సేద తీరుతూ రొమాన్స్ చేస్తున్న వీడియోను ఎడిట్ చేసి రీల్ గా పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

గాయాలు, ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు, చెడు స్నేహాల కార‌ణంగా త‌న కెరీర్‌ను పృథ్వీ షా నాశ‌నం చేసుకున్నాడు. ఎంత వేగంగా టీమ్ఇండియా త‌లుపు త‌ట్టాడో అంతే వేగంగా అత‌డు జ‌ట్టుకు దూరం అయ్యాడు. ఐపీఎల్ 2025 మెగావేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన అత‌డిని ఐపీఎల్ 2026 మినీ వేలంలో తొలుత ఎవ‌రూ కొనుగోలు చేయ‌లేదు. ఆఖ‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ 75 ల‌క్ష‌ల‌కు అత‌డిని తీసుకుంది. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లోనైనా రాణించి టీమ్ఇండియా త‌లుపు త‌ట్టాల‌ని అత‌డి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

WPL 2026 : ఆ ఒక్క త‌ప్పిదంతోనే ఓడిపోయాం.. లేదంటేనా.. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కామెంట్స్‌..

ఇదిలా ఉంటే.. పృథ్వీ షా విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఓ మోస్త‌రు ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 32.16 స‌గ‌టుతో 193 ప‌రుగులు చేశాడు.