ముంబై : గత మూడు నెలలుగా ప్రేక్షకులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 6 ముగిసింది. టైటిల్ బెంగళూరు బుల్స్ ఎగురేసుకపోయింది. గుజరాత్ ఫార్య్చూన్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు..కానీ పవన్ కుమార్ షెరావత్ పోరాట పటిమతో బెంగళూరు బుల్స్ విజేతగా నిలిచింది. హోరాహరీ ఫైనల్లో 38-33తో ఐదు పాయింట్లతో బెంగళూర్ గెలుపొందింది.
ఆఖరు మూడు నిమిషాల వరకూ టైటిల్ రేసులో నిలిచిన గుజరాత్, పవన్ షెరావత్ కండ్లుచెదిరే రైడింగ్‌తో టైటిల్‌పై ఆశలు కోల్పోయింది. తొలి పది నిమిషాల్లో 6-6తో సమవుజ్జీలుగా ఇరు జట్లు సాగాయి. 16-9తో బెంగళూర్‌పై గుజరాత్ పైచేయి సాధించింది. ద్వితీయార్థంలోనూ ఆ జట్టు జోరు సాగింది. ఇక్కడ పవన్ కుమార్ తన ప్రతిభను చూపెట్టాడు. కూతకు వెళ్లిన ప్రతిసారి…రెండేసి పాయింట్లు కొల్లగొట్టాడు. 37వ నిమిషంలో 29-29తో స్కోరు సమంగా ఉన్న తరుణంలో రెండు పాయింట్లతో గుజరాత్‌ను ఆలౌట్ చేసిన పవన్ 36 -29 తో బెంగళూర్ విజయాన్ని ఖాయం చేశాడు.