PV Sindhu : చ‌రిత్ర సృష్టించిన తెలుగు తేజం.. జ‌పాన్ ఓపెన్‌ ఫైన‌ల్‌కు పీవీ సింధు..

భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు (PV Sindhu )చ‌రిత్ర సృష్టించింది.

PV Sindhu creates history enter into Japan Open 2026 final

PV Sindhu : భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు చ‌రిత్ర సృష్టించింది. తొలిసారి జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ 750 టోర్నీలో ఫైన‌ల్‌కు చేరుకుంది. ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త ష‌ట్లర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. తెలుగు తేజం సింధు సెమీస్‌లో చైనాకు చెందిన చెన్ యుఫీయుని 21-19, 15-10 తేడాతో ఓడించింది. ఈ క్ర‌మంలో చైనా ప్రత్యర్థిపై ఐదు గేమ్‌ల ఓటమి పరంపరకు ముగింపు పలికింది.

రెండో సెట్‌లో సింధు ఆధిక్యంలో ఉన్న స‌మ‌యంలో తొడ కండ‌రాల గాయం కార‌ణంగా యుఫీయ్ రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో సింధు ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. కాగా.. గ‌త రెండళ్ల కాలంలో ఓ టోర్నీలో సింధు ఫైన‌ల్‌కు చేర‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ రిటైర్‌మెంట్ వార్త‌ల వేళ‌.. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొట‌క్ కీల‌క వ్యాఖ్య‌లు..

మ‌రో సెమీఫైన‌ల్‌లో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వార్దానీపై జపాన్‌కు చెందిన అకానె య‌మ‌గూచి విజ‌యం సాధించింది. తొలి సెట్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి ఆ త‌రువాత వ‌రుస‌గా రెండు సెట్ల‌ను కైవ‌సం చేసుకుని 9-21, 21-16, 21-14 తేడాతో య‌మ‌గూచి విజ‌యం సాధించి ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది.

ఆదివారం (జూలై 19) నాడు జరిగే ఫైనల్‌లో పీవీ సింధు, యమగూచి అమీతుమీ తేల్చుకోనున్నారు.