Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల వేళ.. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కీలక వ్యాఖ్యలు..
ఇంగ్లాండ్‌తో ఆదివారం జరగనున్న మూడో వన్డే మ్యాచే అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మకు (Rohit Sharma) ఆఖరి మ్యాచ్ అని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Sitanshu Kotak Responds To Rohit Sharma Under Pressure Claim Amid Retirement Rumours
Rohit Sharma : ఇంగ్లాండ్‌తో ఆదివారం జరగనున్న మూడో వన్డే మ్యాచే అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మకు ఆఖరి మ్యాచ్ అని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెలక్టర్ల వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల్లో హిట్‌మ్యాన్ లేడని, ఇంగ్లాండ్ సిరీసే ఆఖరిది అని, అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యం కోరుకుంటోందని, ఇప్పటికే ఈ విషయాన్ని రోహిత్ శర్మకు వివరించినట్లు సదరు వార్తల సారాంశం.
ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారులతో రోహిత్ సమావేశం అయ్యాడని, బోర్డు నిర్ణయం పై అసంతృప్తిని వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ విషయంలో రోహిత్ శర్మపై మేనేజ్మెంట్ ఎలాంటి ఒత్తిడి పెట్టట్లేదని స్పష్టం చేశాడు.
Harry Brook : భారత్ పై రెండో వన్డేలో విజయం.. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు..
హిట్‌మ్యాన్ లాంటి సీనియర్ ఆటగాడిపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నాడు. అతడు కూడా ఒత్తిడిని ఫీలయ్యే ఆటగాడు కాదన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు వన్డే మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేదన్నది నిజమేనని, అయితే.. దాని వల్ల అతడి కెరీర్ విషయంలో పెద్ద తేడా ఏం ఉందన్నాడు. రోహిత్ ఫామ్‌లో లేడని తాను అనుకోవడం లేదన్నాడు. షాట్ ఎంపిక పని చేయకపోవచ్చునని అన్నాడు. లార్డ్స్‌లో జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌లో అతడు తప్పకుండా మంచి ఇన్నింగ్స్ ఆడతాన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో రోహిత్ శర్మ 11 పరుగులు మాత్రమే చేయగా, రెండో వన్డేలో 47 బంతులు ఆడి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. గత ఎనిమిది వన్డే మ్యాచ్‌ల్లో 30.1 సగటుతో 241 పరుగులు సాధించాడు.
