PV Sindhu : ఎవరితోనైనా డేటింగ్ చేశారా?.. పీవీ సింధు తెలివైన సమాధానం

పీవీ సింధు ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కి పరిచయం అవసరం లేదు. 28 ఏళ్ల సింధు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో లవ్ లైఫ్ గురించి ప్రశ్నలు ఎదుర్కున్నారు. మరి సింధు ఏం సమాధానం చెప్పారంటే?

PV Sindhu

PV Sindhu : ఎప్పుడు ఆట గురించి ప్రశ్నలు ఎదుర్కునే స్టార్ ప్లేయర్ సింధుకి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ-పెళ్లి అంశాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. సింధు చెప్పిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

IND vs AUS : అంపైర్ల తప్పిదాల వ‌ల్ల‌నే టీమ్ఇండియా గెలిచిందా..?

ఇప్పటికే రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కి సన్నద్ధమవుతున్నారు. బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పడుకొనె ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని సింధు ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్నారు సింధు. ఆ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి ఎదురైన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు ఇచ్చారు.

‘ఎవరితో అయినా డేటింగ్ లో ఉన్నారా?’ అన్న ప్రశ్నకు ‘సింగిల్’ అని చెప్పిన సింధు ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఒలింపిక్స్ పైనే అని ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పలేనని అన్నారు. ‘మీరు భాగస్వామిని కోరుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు తనకు పార్టనర్ కావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని విధి రాతలో ఏం రాసి ఉంటుందో అదే జరుగుతుందని సింధు సమాధానం చెప్పారు. ‘మీరు ఎవరితో అయినా డేటింగ్ చేసారా?’ అన్న ప్రశ్నకు ‘చేయలేదు’ అని సమాధానం చెప్పారు. నా జీవితంలో సంతోషంగా ఉన్నానని, మంచి స్నేహితులు ఉన్నారని.. చెప్పుకొచ్చారు. ‘ఎలాంటి వ్యక్తిని భాగస్వామిగా కోరుకుంటారు?’ అన్న ప్రశ్నకు  డబ్బున్న వ్యక్తినే చేసుకోవాలనే ఆలోచన లేదని మంచి మనసున్న వ్యక్తి అయితే చాలని నవ్వుతూ సమాధానాలు చెప్పారు సింధు.

Bizarre way dismissal : టీ20 లీగ్​లో వింత ఘటన.. ఇంత‌టి దుర‌దృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండరేమో..!

కామన్వెల్త్ క్రీడల తర్వాత గాయం కారణంగా 5 నెలల పాటు సింధు ఆటకి దూరంగా ఉన్నారు. ఈ తర్వాత ఆడిన అన్ని టోర్నీల్లో మునుపటి ఆటను ప్రదర్శించలేకపోయారు. యూఎస్‌ ఓపెన్‌, కెనడా ఓపెన్‌లలో సింధు క్వార్టర్‌ ఫైనల్లోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రకాశ్ పదుకొనే ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న సింధు బలమైన పునరాగమనంతో 2024 ఒలింపిక్స్‌లో పతకం కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు