Bizarre way dismissal : టీ20 లీగ్​లో వింత ఘటన.. ఇంత‌టి దుర‌దృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండరేమో..!

Tahir Baig Bizarre way dismissal : క్రికెట్‌లో కొన్ని సార్లు విచిత్ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అలాంటి ఘ‌ట‌ననే పాకిస్తాన్ దేశ‌వాలీ టీ20 లీగ్‌లో జ‌రిగింది.

Bizarre way dismissal : టీ20 లీగ్​లో వింత ఘటన.. ఇంత‌టి దుర‌దృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండరేమో..!

Bizarre way dismissal

క్రికెట్‌లో కొన్ని సార్లు విచిత్ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అలాంటి ఘ‌ట‌ననే పాకిస్తాన్ దేశ‌వాలీ టీ20 లీగ్‌లో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ బ్యాట‌ర్ హిట్‌వికెట్ గా ఔటైన తీరుపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. నీలాంటి దుర‌దృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండ‌రు భ‌య్యా అని అంటున్నారు.

ఏం జ‌రిగిందంటే..?

పాకిస్తాన్ నేష‌న‌ల్ టీ20 టోర్నీలో భాగంగా శ‌నివారం (డిసెంబ‌ర్ 2న‌) అబ్బొట్టబాద్​, సియాల్‌కోట్ జ‌ట్ల మ‌ధ్య టీ20 మ్యాచ్ జ‌రిగింది. సియాల్‌కోట్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పాక్ యువ బ్యాట‌ర్ అయిన మీర్జా తాహిర్ సియాల్‌కోట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్‌ను స్పిన్న‌ర్ యాసిర్ షా వేశాడు. తాహిర్ పుల్ షాట్ ఆడాడు. ఈ క్ర‌మంలో అత‌డి బ‌రువు మొత్తం ఒక్క కాలిపై ప‌డింది. దీంతో కాలు కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అత‌డు బ్యాలెన్స్ కోల్పోయాడు.

IND vs AUS : కొద్దిలో మిస్సైంది.. లేకుంటే అంపైర్ బాక్స్ బ‌ద్ద‌ల‌య్యేదిగా..! వీడియో వైర‌ల్‌

నొప్పితో విల‌విల‌లాడుతూ స్టంప్స్ పై ప‌డ్డాడు. బెయిల్స్ కింద ప‌డ‌డంతో అత‌డు హిట్‌వికెట్‌గా పెవిలియ‌న్ చేరుకున్నాడు. ఈ మ్యాచులో అత‌డు 38 ప‌రుగులు చేశాడు. ఈ వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన సియాల్‌కోట్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 119 ప‌రుగులు చేసింది. సియాల్ కోట్ బ్యాట‌ర్ల‌లో 29 బంతుల్లో 38 ప‌రుగులు చేసిన తాహిర్ దే అత్య‌ధిక స్కోర‌ర్‌గా నిలిచాడు. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని అబ్బొట్టబాద్​ 17.4 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

IND vs SA : టీమ్ఇండియాతో సిరీస్‌.. కెప్టెన్‌కు షాకిచ్చిన ద‌క్షిణాఫ్రికా.. పెద్ద ప్లానే..!