IND vs AUS : కొద్దిలో మిస్సైంది.. లేకుంటే అంపైర్ బాక్స్ బ‌ద్ద‌ల‌య్యేదిగా..! వీడియో వైర‌ల్‌

India vs Australia : ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను భార‌త్ విజ‌యంతో ముగించింది.

IND vs AUS : కొద్దిలో మిస్సైంది.. లేకుంటే అంపైర్ బాక్స్ బ‌ద్ద‌ల‌య్యేదిగా..! వీడియో వైర‌ల్‌

Nathan Ellis Shot Hits Umpire

ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను భార‌త్ విజ‌యంతో ముగించింది. ఆదివారం బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి టీ20 మ్యాచులో టీమ్ఇండియా 6 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో 4-1తో సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్‌లో ఓ స‌ర‌దా ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆఖ‌రి ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు అవ‌స‌రం కాగా..

ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఆస్ట్రేలియా విజ‌యానికి 10 ప‌రుగులు అవ‌స‌రం. ఆఖ‌రి ఓవ‌ర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. మొద‌టి నాలుగు బంతుల్లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో విజ‌య‌స‌మీక‌ర‌ణం రెండు బంతుల్లో 9 ప‌రుగులుగా మారింది. ఐదో బంతిని అర్ష్‌దీప్ సింగ్ వేయ‌గా బ్యాట‌ర్ నాథన్ ఎలిస్ స్ట్రైట్ షాట్ ఆడాడు. బంతిని ఆపేందుకు అర్ష్‌దీప్ ప్ర‌య‌త్నించాడు. అయితే.. అది సాధ్యం కాలేదు.

IND vs SA : టీమ్ఇండియాతో సిరీస్‌.. కెప్టెన్‌కు షాకిచ్చిన ద‌క్షిణాఫ్రికా.. పెద్ద ప్లానే..!

బంతి నేరుగా వెళ్లి అంపైర్ వీరేంద‌ర్ శ‌ర్మ‌కు త‌గిలింది. అంపైర్ బంతిని త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ తొడ‌ను తాకింది. ఒక‌వేళ అంపైర్‌కు బంతి తాక‌కుండా ఉంటే బౌండ‌రీ వెళ్లే అవ‌కాశాలు చాలా మెండుగా ఉన్నాయి. దీన్ని చూసిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొంచెం అయితే.. అంపైర్ బాక్స్ బ‌ద్ద‌లు అయ్యేది.. జ‌స్ట్ మిస్ అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత‌ బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు న‌ష్ట‌పోయి 160 ప‌రుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ ( 53) అర్ధ‌శ‌త‌కం బాదాడు. మిగిలిన వారిలో అక్ష‌ర్ ప‌టేల్ (31), జితేశ్ శ‌ర్మ (24), య‌శ‌స్వి జైస్వాల్ (21) లు రాణించ‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ (5), రింకూ సింగ్ (6), రుతురాజ్ గైక్వాడ్ (10)లు విఫ‌లం అయ్యారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో బెన్ డార్వాయిస్‌, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. తన్వీర్ సంఘ, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ లు ఒక్కొ వికెట్ తీశారు.

Rohit Sharma : భార్య‌, కూతురితో స్వ‌దేశానికి చేరుకున్న రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్

అనంతరం ల‌క్ష్య ఛేద‌న‌లో బెన్ మెక్‌డెర్మాట్ (54) అర్ధ‌ సెంచ‌రీతో రాణించినా ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 154 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.