IND vs SA : టీమ్ఇండియాతో సిరీస్‌.. కెప్టెన్‌కు షాకిచ్చిన ద‌క్షిణాఫ్రికా.. పెద్ద ప్లానే..!

India tour of South Africa : భార‌త్ వేదిగ‌కా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు సెమీఫైన‌ల్ మ్యాచులో ఓడి పోవ‌డంతో టోర్నీ నుంచి నిష్ర్క‌మించింది.

IND vs SA : టీమ్ఇండియాతో సిరీస్‌.. కెప్టెన్‌కు షాకిచ్చిన ద‌క్షిణాఫ్రికా.. పెద్ద ప్లానే..!

India tour of South Africa

భార‌త్ వేదిగ‌కా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు సెమీఫైన‌ల్ మ్యాచులో ఓడి పోవ‌డంతో టోర్నీ నుంచి నిష్ర్క‌మించింది. ఆ జ‌ట్టు మెగా టోర్నీలో అంచ‌నాల‌ను మించి రాణించిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు కెప్టెన్ టెంబా బవుమా మాత్రం బ్యాటింగ్‌లో దారుణంగా విఫ‌లం అయ్యాడు. ఈ క్ర‌మంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఎ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ‌న్డేల్లో కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డంతో పాటు ఆ ఫార్మాట్‌లో క‌నీసం జ‌ట్టులో చోటు లేకుండా చేసింది.

టీమ్ఇండియా ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచులు ఆడ‌నుంది. డిసెంబ‌ర్ 10 నుంచి టీ20 సిరీస్‌తో భార‌త ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో భార‌త్ తో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. టెంబా బ‌వుమా, పేస‌ర్ క‌గిసో రబాడల‌ను ప‌రిమిత ఓవ‌ర్ల నుంచి త‌ప్పించింది. ఎయిడెన్ మార్క్ర‌మ్ ను వ‌న్డేలు, టీ20ల‌కు కెప్టెన్‌గా నియ‌మించింది.

Ruturaj Gaikwad : 10 ప‌రుగులే చేసినా.. చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌.. ఒకే ఒక్క‌డు

మ‌రో ఏడు నెల‌ల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆరంభం కానుండ‌డంతో పొట్టి ఫార్మాట్‌కు యువ ఆట‌గాళ్ల‌ను ఎక్కువగా ఎంపిక చేసింది.

ద‌క్షిణాఫ్రికా టీ20 జ‌ట్టు : ఎయిడెన్ మార్క్‌ర‌మ్ (కెప్టెన్), ఒట్నిల్ బార్ట్‌మ‌న్, మాథ్యూ బ్రీట్జ్‌, నండ్రె బ‌ర్గ‌ర్, డొనొవ‌న్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్‌, హెన్రిచ్ క్లాసెన్, కేశ‌వ్ మ‌హారాజ్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, అండిల్ పెహ్లుక్వాయో, త‌బ్రైజ్ షంసీ, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్, లిజాడ్ విలియ‌మ్స్, లుంగి ఎంగిడి, గెరాల్డ్ కోయెట్జ్, మార్కో జాన్సెన్. వీరిలో లుంగి ఎంగిడి, గెరాల్డ్ కోయెట్జ్, మార్కో జాన్సెన్ ల‌ను మొద‌టి రెండు టీ20ల‌కు మాత్ర‌మే ఎంపిక చేసింది.

ద‌క్షిణాప్రికా వ‌న్డే జ‌ట్టు : ఎయిడెన్ మార్క్‌ర‌మ్ (కెప్టెన్), ఒట్నిల్ బార్ట్‌మ‌న్, నండ్రె బ‌ర్గ‌ర్, టోని డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌, కేశ‌వ్ మ‌హారాజ్, మిహ‌లి ఎంప‌గ్వానా, డేవిడ్ మిల్ల‌ర్, వియాన్ మ‌ల్డ‌ర్, ఆండిల్ పెహ్లుక్వాయో, త‌బ్రైజ్ షంసీ, ర‌స్సీ వాన్‌డెర్ డ‌సెన్, కైల్ వెర్రెయెన్, లిజాడ్ విలియ‌మ్స్

ద‌క్షిణాప్రికా టెస్టు జ‌ట్టు : టెంబా బవుమా (కెప్టెన్‌), డేవిడ్ బెడింగ్హ‌మ్, నండ్రె బ‌ర్గ‌ర్, గెరాల్డ్ కొయెట్జ్, టోని డిజోర్జి, డీన్ ఎల్గ‌ర్, మార్కో జాన్సెన్, కేశ‌వ్ మ‌హారాజ్‌, ఎయిడెన్ మార్క్‌ర‌మ్, వియాన్ మ‌ల్డ‌ర్, లుంగి ఎంగిడి, కీగ‌న్ పీట‌ర్స‌న్, క‌గిసొ ర‌బాడా, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్, కైల్ వెర్రెయెన్