Bizarre way dismissal : టీ20 లీగ్‌లో వింత ఘటన.. ఇంతటి దురదృష్టవంతుడు మరొకరు ఉండరేమో..!
Tahir Baig Bizarre way dismissal : క్రికెట్లో కొన్ని సార్లు విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటననే పాకిస్తాన్ దేశవాలీ టీ20 లీగ్‌లో జరిగింది.
- Thota Vamshi Kumar
- Published on- December 4, 2023 / 08:03 PM IST
Bizarre way dismissal
క్రికెట్లో కొన్ని సార్లు విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటననే పాకిస్తాన్ దేశవాలీ టీ20 లీగ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బ్యాటర్ హిట్‌వికెట్ గా ఔటైన తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. నీలాంటి దురదృష్టవంతుడు మరొకరు ఉండరు భయ్యా అని అంటున్నారు.
ఏం జరిగిందంటే..?
పాకిస్తాన్ నేషనల్ టీ20 టోర్నీలో భాగంగా శనివారం (డిసెంబర్ 2న) అబ్బొట్టబాద్, సియాల్కోట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. సియాల్కోట్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. పాక్ యువ బ్యాటర్ అయిన మీర్జా తాహిర్ సియాల్కోట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను స్పిన్నర్ యాసిర్ షా వేశాడు. తాహిర్ పుల్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో అతడి బరువు మొత్తం ఒక్క కాలిపై పడింది. దీంతో కాలు కండరాలు పట్టేయడంతో అతడు బ్యాలెన్స్ కోల్పోయాడు.
IND vs AUS : కొద్దిలో మిస్సైంది.. లేకుంటే అంపైర్ బాక్స్ బద్దలయ్యేదిగా..! వీడియో వైరల్
నొప్పితో విలవిలలాడుతూ స్టంప్స్ పై పడ్డాడు. బెయిల్స్ కింద పడడంతో అతడు హిట్‌వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. ఈ మ్యాచులో అతడు 38 పరుగులు చేశాడు. ఈ వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సియాల్కోట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. సియాల్ కోట్ బ్యాటర్లలో 29 బంతుల్లో 38 పరుగులు చేసిన తాహిర్ దే అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని అబ్బొట్టబాద్ 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
IND vs SA : టీమ్ఇండియాతో సిరీస్.. కెప్టెన్‌కు షాకిచ్చిన దక్షిణాఫ్రికా.. పెద్ద ప్లానే..!
