PV Sindhu : పారిస్ ఒలింపిక్స్‌లో సింధు దూకుడు.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం.. ప్రిక్వార్టర్స్‌లోకి..
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొడుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 31, 2024 / 02:22 PM IST
PV Sindhu
PV Sindhu : రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొడుతోంది. వరుసగా రెండో గేమ్‌లోనూ విజయం సాధించింది తెలుగు తేజం. బుధవారం ఎస్తెనియా ప్లేయర్ క్రిస్టిన్ కూబాపై గెలుపొందింది. ఈ గెలుపుతో సింధు ప్రిక్వార్టర్స్(రౌండ్-16)కు దూసుకువెళ్లింది. పారిస్ ఒలింపిక్స్‌లో 10వ సీడ్‌గా ఉన్న సింధు, 73వ ర్యాంక్‌లో ఉన్న క్రిస్టిన్ కూబాపై 21-15, 21-10 తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. సింధుకు తొలి గేమ్‌లో క్రిస్టిన్ ఏ మాత్రం పోరాటం ఇవ్వలేకపోయింది. అయితే.. రెండో రౌండ్లో మాత్రం కాస్త ప్రతిఘటించింది. ఆదివారం అబ్దుల్ రజాక్ ఫాతిమాపై సింధు గెలిచిన సంగతి తెలిసిందే.
