IPL 2025 Mega Auction : కొంచెం క‌నిక‌రించండి.. ఎనిమిది మందిని రిటైన్ చేసుకుంటాం.. బీసీసీఐకి ఫ్రాంచైజీల విజ్ఞ‌ప్తి..!

ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం ఇప్ప‌టి నుంచే అన్ని జ‌ట్లు సిద్ధం అవుతున్నాయి.

IPL 2025 Mega Auction : కొంచెం క‌నిక‌రించండి.. ఎనిమిది మందిని రిటైన్ చేసుకుంటాం.. బీసీసీఐకి ఫ్రాంచైజీల విజ్ఞ‌ప్తి..!

IPL 2025 Auction Top Franchise Wants 8 Retentions Report

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం ఇప్ప‌టి నుంచే అన్ని జ‌ట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఆటగాళ్ల రిటైన్షన్‌, జట్టు పర్స్ వాల్యూ, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ వంటి వాటి గురించి ఫ్రాంచైజీల‌తో చ‌ర్చించేందుకు నేడు ముంబైలో బీసీసీఐ స‌మావేశం కానున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆటగాళ్ల రిటైన్ష‌న్‌, జ‌ట్టు ప‌ర్స్ వాల్యూల‌ను పెంచాల‌ని ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ను కోరుతున్నాయి అన్ని ఫ్రాంచైజీలు.

మెగా వేలంలో ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్ల‌కు పెంచాల‌ని ఫ్రాంచైజీలు కోరుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌తి జ‌ట్టు ప‌ర్స్ వాల్యూ రూ.100 కోట్లుగా ఉంది. అంతేకాదండోయ్‌.. ఆరుగురిని రిటైన్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. అయితే.. ఐపీఎల్ టాప్ జ‌ట్ల‌లో ఓ జ‌ట్టు మాత్రం ఏకంగా ఎనిమిది మందికి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతుంది. ఇప్పటివరకు నలుగురు ఆట‌గాళ్లను మాత్రమే రిటైన్‌ చేసుకొనే వెసులుబాటు ఉంది.

IND vs SL 3rd T20 : బంతితో మాయ చేసిన బ్యాట‌ర్లు సూర్య‌, రింకూ.. నెట్టింట గంభీర్ మీమ్స్ వైర‌ల్‌..

పర్స్‌ వాల్యూ పెంచే విష‌యంలో బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ సానుకూలంగా ఉంద‌ట‌. క‌నీసం 20 నుంచి 25 శాతం వ‌ర‌కు ఇది ఉండొచ్చున‌ని తెలుస్తోంది. ఇక్క‌డ రిటెన్ష‌న్ వ్య‌వ‌హ‌ర‌మే స‌మ‌స్య‌గా మారుతోంది. రైట్‌ టు మ్యాచ్‌తో కలిపి రిటెన్షన్‌లో 8 మందికి ఛాన్స్ ఇవ్వాల‌ని ఫ్రాంఛైజీలు కోరుతున్నాయి. ఇలా చేస్తే వేలం చ‌ప్ప‌గా ఉంటుంద‌ని, కీల‌క ఆట‌గాళ్ల‌కు వేలంలోకి రార‌ని బీసీసీఐ భావిస్తోంద‌ట‌.

అయితే.. 6 గురికి అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకుంటుంద‌ట‌. ఇందులో ఓ అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్‌ను భాగ‌స్వామిని చేయాల‌నే నిబంధ‌న పెట్టాల‌ని భావిస్తోంద‌ని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ ప్లేయర్ల రిటైన్‌ విషయంలోనూ చర్చ జరగనుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ జట్లు ఒకరి కంటే ఎక్కువ మంది ఓవర్సీస్ ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయ‌ని బీసీసీఐ వ‌ర్గాలు చెప్పాయి. మ‌రోవైపు చెన్నై సూప‌ర్ కింగ్స్ మాత్రం ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ ఉండాల‌ని కోరుకుంటుంది. ఎందుకంటే దీని వ‌ల్ల ధోని వంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు మ‌రికొంత‌కాలం కొన‌సాగేందుకు ఈ నిబంధ‌న ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

Suryakumar Yadav : డేవిడ్ వార్న‌ర్ రికార్డు స‌మం.. కోహ్లీ రికార్డుకు ద‌గ్గ‌ర‌గా సూర్య‌కుమార్‌..