రాజస్తాన్, పంజాబ్ మ్యాచ్‌లో బట్లర్ అవుట్ అయిన విధానం ఇప్పుడు వివాదంగా మారింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి బట్లర్ అవుట్ అవగా.. బట్లర్‌ను అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా ఔట్ చేయడమే వివాదానికి కారణం అయింది. అశ్విన్ బ్యాట్స్‌మెన్‌కు బంతి వేస్తుండగా.. రన్నర్‌గా ఉన్న రాజస్తాన్ ఆటగాడు బట్లర్ క్రీజులోంచి బయటకు వచ్చాడు. దీంతో వికెట్ పడగొట్టి అశ్విన్ అవుట్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని అవుట్‌గానే ప్రకటించడంతో బట్లర్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదనలు నడిచాయి.
నిబంధనల (రూల్ 41.16) ప్రకారమైతే థర్డ్ అంపైర్ చేసింది సరైందే. కానీ సుదీర్ఘ కెరీర్‌లో ‘జెంటిల్‌మన్’గా ఉన్న అశ్విన్… ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడాన్ని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపిస్తుంది. బట్లర్ క్రీజ్ దాటేవరకు కావాలనే వేచి చూసి వికెట్లకు కొట్టినట్లు కనిపించింది. అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించేలా అనైతికంగా ఇటువంటి పనిని చేశాడంటూ నెటజన్‌లు మండిపడుతున్నారు. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ బ్యాట్స్‌మెన్‌ని మాన్కడింగ్ అవుట్ చేయడం ఇదే తొలిసారి. ఒకసారి హెచ్చరించిన తరువాతే ఇలా చేయాలి. అయితే అశ్విన్ అలా చేయలేదంటూ క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అశ్విన్ మాత్రం తను చేసిన పనిని సమర్ధించుకుంటున్నారు. మాన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయింది. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ నుండి బయటకు వెళ్లాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ అప్రమత్తంగా ఉండాలని అశ్విన్ సూచించాడు. అయితే అశ్విన్ బట్లర్‌ను అవుట్ చేయడంతో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయి రాజస్థాన్ రాయల్స్ గెలిచారు అనేది విశ్లేషకుల అభిప్రాయం.
can you believe Ashwin world’s best spinner??? pic.twitter.com/P3S2uuHKXp
— ketan sawant (@SawantKetan225) 25 March 2019