IND vs NZ : భార‌త్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్..

భార‌త్‌తో అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు (IND vs NZ ) ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ త‌గిలింది.

Rachin Ravindra in doubt for India T20Is after dislocating shoulder during promo shoot

IND vs NZ : భార‌త్‌తో అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు ర‌చిన్ ర‌వీంద్ర గాయ‌ప‌డ్డాడు. సెప్టెంబ‌ర్ 16న ఓ ప్ర‌చార సంస్థ నిర్వ‌హించిన ప్ర‌మోష‌న్ షూట్‌లో డైవిండ్ క్యాచ్ అందుకునే క్ర‌మంలో అత‌డి కుడి భుజం డిస్‌లోకేష‌న్ అయింది. ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది.

‘ఇది నిజంగా ఒక దురదృష్టకరమైన ఘ‌ట‌న‌. ర‌చిన్‌ త్వరగా కోలుకుని, వీలైనంత త్వరగా తిరిగి మైదానంలోకి వచ్చేలా చూడటమే మా ప్రధాన ప్రాధాన్యత. అన్ని వాణిజ్య షూట్‌ల మాదిరిగానే, తగిన భద్రతా చర్యలను పాటిస్తూ ఈ కార్యకలాపాలకు అన్ని పక్షాలూ ముందుగానే అంగీకరించాయి. ఇది ఒక రకమైన అనుకోని ప్రమాదం. భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్‌ల విషయంలో మా ప్రక్రియలను మేము సమీక్షించడం కొనసాగిస్తాము.’ అని న్యూజిలాండ్ పెర్ఫార్మెన్స్ మేనేజర్ మైక్ శాండిల్ అన్నారు.

Team India : మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా గేమ్స్‌ పతకాలను టీమ్ఇండియా తీసుకోవాల్సిందేనా?

భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (IND vs NZ ) అక్టోబర్ 22న నుంచి ప్రారంభం కానుంది. అప్ప‌టి వ‌ర‌కు ర‌చిన్ గాయం నుంచి కోలుకుంటాడా? లేదా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేక‌పోతున్నారు. ఇక ఈ సిరీస్ కోసం జ‌ట్టును వ‌చ్చేవారం న్యూజిలాండ్ ప్ర‌క‌టించ‌నుంది.

భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 22న -క్రైస్ట్ చ‌ర్చ్‌
* రెండో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 24న – క్రైస్ట్ చ‌ర్చ్‌
* మూడో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 27న – వెల్లింగ్ట‌న్
* నాలుగో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 30న – ఆక్లాండ్
* ఐదో టీ20 మ్యాచ్ – న‌వంబ‌ర్ 1న – హామిల్ట‌న్‌