Rahul Dravid: టీమిండియా కోచ్ పదవి ఆఫర్ సున్నితంగా తిరస్కరించిన ద్రవిడ్

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆఫర్ ను టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించారు.

Rahul Dravid: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆఫర్ ను టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించారు. సీనియర్ టీం కోచ్ పదవి ఆఫర్ వచ్చినప్పటికీ వదిలేశారట. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14వరకూ జరగనున్న టోర్నీ వరకూ మాత్రమే రవిశాస్త్రి ఆ పదవిలో కొనసాగుతారు.

శాస్త్రితో పాటు ఇతర సపోర్ట్ స్టాఫ్ సభ్యులు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ లు సైతం ఆ పదవులకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఇక టీం స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ సైతం వరల్డ్ కప్ తర్వాత బాధ్యతలు వదిలేయనున్నారు.

నేషనల్ క్రికెట్ అకాడమీలో 48ఏళ్ల ద్రవిడ్.. అండర్ 19 టీమ్, ఇండియా ఏ టీంలకు ఇన్ ఛార్జిగా ఉండి సక్సెస్ అయ్యారు. దీంతో టీమిండియా కోచ్ పదవిని ఆఫర్ చేసింది బీసీసీఐ. ఈ ఆఫర్ ను ద్రవిడ్ తిరస్కరించడం కొత్తేం కాదు. నేషనల్ క్రికెట్ అకాడమీలో జూనియర్ క్రికెట్ కు సర్వీస్ చేయడంలో బిజీగా ఉండిపోయాడు ద్రవిడ్. 2016, 2017లలోనూ బీసీసీఐ రిక్వెస్ట్ ను ఇలాగే తిప్పి పంపించాడు.

…………………………………………: కోహ్లీ.. డివిలియర్స్ నా కోరిక తీర్చలేకపోయారు – సెహ్వాగ్

రా టాలెంట్ ను గాడిలో పెట్టడానికే ద్రవిడ్ ఇష్టపడతాడట. ప్లేయర్లను రెడీ చేసి ఇంటర్నేషనల్ లెవల్ కు పంపించడమే అతనికి నచ్చేది. 2018లో ఇండియా ఓవర్సీస్ బ్యాటింగ్ కన్సల్టెంట్ గా చేసిన ద్రవిడ్.. రీసెంట్ గా లిమిటెడ్ ఓవర్స్ కు టీం కోచ్ గా శ్రీలంక కూడా వెళ్లాడు. ఆ సమయంలో శాస్త్రి, అరుణ్, విక్రమ్ రాథోర్ లేకపోవడంతో మాత్రమే అలా జరిగింది..

మరికొద్ది రోజుల్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఈవెంట్ కోసం ఇండియన్ ప్లేయర్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ సభ్యులు యూఏఈకు చేరుకున్నారు. కొందరు ఐపీఎల్ 2021లో ఉండగా అక్టోబర్ 15తో ముగియనుంది. అంటే టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ కు రెండ్రోజుల ముందే ప్లేయర్లు ఫ్రీ అవుతారు. అక్టోబర్ 24న జరిగే పాకిస్తాన్ తో మ్యాచ్ తోనే ఇండియా టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడనుంది.

ట్రెండింగ్ వార్తలు