Rahul Dravid Son Samit Dravid Hits Massive Six In Maharaja Trophy 2024
Samit Dravid Massive Six : టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. టీమ్ఇండియాలో చోటే లక్ష్యంగా తీవ్రంగా కష్టపడుతున్నాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లో మైసూర్‌కు సమిత్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా.. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. అయినప్పటికి అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బ్లాస్టర్స్, మైసూర్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 18 ఓవర్లలో మైసూర్ వారియర్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సమిత్ ఏడు పరుగులే చేశాడు.
WI vs SA : చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్
బెంగళూరు పేసర్ నవీన్ వేసిన 7వ ఓవర్‌లోని నాలుగో బంతిని సమిత్ ద్రవిడ్ లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. అతడు కొట్టిన ఈ షాట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమిత్ దూకుడుగా ఆడే విధానాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 183 లక్ష్యాన్ని బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు 17.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. బెంగళూరు బ్యాటర్లలో భువన్ రాజు 24 బంతుల్లో 6 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 51 పరుగులతో రాణించాడు.
మహారాజా ట్రోఫీ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమైంది. అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది.
లేడీ బుమ్రాను చూశారా..! బుమ్రా బౌలింగ్ యాక్షన్‌తో అదరగొట్టిన యువతి.. వీడియో వైరల్
ದ್ರಾವಿಡ್ ಸರ್ ಮಗ ಗುರು ಇವ್ರು..??
ಈ ಸಿಕ್ಸ್ ಗೆ ಒಂದು ಚಪ್ಪಾಳೆ ಬರ್ಲೇಬೇಕು..??
? ನೋಡಿರಿ Maharaja Trophy KSCA T20 | ಬೆಂಗಳೂರು vs ಮೈಸೂರು | LIVE NOW #StarSportsKannada ದಲ್ಲಿ#MaharajaTrophyOnStar@maharaja_t20 pic.twitter.com/ROsXMQhtwO
— Star Sports Kannada (@StarSportsKan) August 16, 2024