Samit Dravid : సమిత్ ద్రవిడ్ ఇన్సైడ్ ఔట్ షాట్ చూశారా..? ద్రవిడ్ కొడుకు పవర్ హిట్టరే..!
టీమ్ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే పనిలో ఉన్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- August 19, 2024 / 12:13 PM IST
Rahul Dravids Son Samit Smashes Sensational Inside Out Six
Rahul Dravid – Samit Dravid : టీమ్ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే పనిలో ఉన్నాడు. టీమ్ఇండియాలో చోటే లక్ష్యంగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లో మైసూర్ వారియర్స్ తరుపున ఆడుతున్న సమిత్ తనలోని పవర్ హిట్టింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడు. గుల్బర్గా మిస్టిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 బంతులను ఎదుర్కొన్న సమిత్ 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 33 పరుగులు చేశాడు.
కాగా.. బౌలర్ ప్రవీణ్ దూబే ఇన్నింగ్స్ 10వ ఓవర్లోని ఓ బంతిని గూగ్లీగా వేశాడు. సమిత్ తన అద్భుత నైపుణ్యంతో డీప్ కవర్ రీజియన్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సమిత్ అవలీలగా సిక్స్‌లు కొడుతుండడాన్ని చూస్తున్న ద్రవిడ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అతడిని టీమ్ఇండియా తరుపున చూడాలని కోరుకుంటున్నారు.
సమిత్‌తో పాటు కరుణ్ నాయర్ (35 బంతుల్లో 66) హాప్ సెంచరీతో రాణించడంతో మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తరువాత స్మరన్ (60 బంతుల్లో 104 నాటౌట్) సెంచరీతో కదం తొక్కడంతో గుల్బర్గా మిస్టిక్స్ ఆఖరి బంతిని విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో వారియర్స్‌కు వరుసగా ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.
Rishabh Pant : సరికొత్త అవతారం ఎత్తిన పంత్.. నీలో ఈ కళ కూడా ఉందా..? బ్యాటర్లకు చుక్కలే..
