Rishabh Pant : సరికొత్త అవతారం ఎత్తిన పంత్.. నీలో ఈ కళ కూడా ఉందా..? బ్యాటర్లకు చుక్కలే..
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తరువాత బ్యాటర్లు సైతం బౌలింగ్ చేస్తున్న సందర్భాలను చూశాం.

Rishabh Pant Bowls Leg Spin During Delhi Premier League T20
Pant bowling : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తరువాత బ్యాటర్లు సైతం బౌలింగ్ చేస్తున్న సందర్భాలను చూశాం. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, రింకూసింగ్‌లు, వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ లు బౌలింగ్ చేశారు. ఇక ఇప్పుడు రిషబ్ పంత్ సరికొత్త అవతారం ఎత్తాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన పంత్ బౌలింగ్ కూడా చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఇది చోటు చేసుకుంది.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో రిషబ్ పంత్ పురాణి ఢిల్లీ 6కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ తో జరిగిన మ్యాచ్‌లో పంత్ బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో పురాణి ఢిల్లీ 6 తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ 19.1 ఓవర్లలోనే అందుకుంది.
ICC : క్రికెట్ అభిమానులకు శుభవార్త.. మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ట్ కు చివరి ఓవర్‌లో ఒక పరుగు సాధిస్తే విజయం సొంతం అవుతుంది అనగా.. ఆఖరి ఓవర్‌ను కెప్టెన్ రిషబ్ పంత్ వేశాడు. తొలి బంతి వేయగానే సూపర్ స్టార్జ్ బ్యాటర్ సింగిల్ తీయడంతో ఆ జట్టు విజయం సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న పంత్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కసారిగా బౌలింగ్ వేయలేదు.
ఇక ఈ మ్యాచ్‌లో పంత్ 32 బంతులు ఎదుర్కొని 35 పరుగులే చేశాడు. పంత్ లెగ్ స్పిన్ వేశాడు. ఇక అతడి బౌలింగ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పంత్ నీలో ఈ కళ కూడా ఉందా..? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Pat Cummins : టీమ్ఇండియాతో టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కీలక నిర్ణయం
Rishabh pant bowling ??pic.twitter.com/QvM7tFZLcu
— ? ¹⁷ ?? (@twitfrenzy_) August 17, 2024