Pat Cummins : టీమ్ఇండియాతో టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కీలక నిర్ణయం
భారత జట్టు ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

Pat Cummins big step ahead of Border Gavaskar series between India and Australia
భారత జట్టు ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా.. ఈ కీలక సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రెండు నెలల పాటు ఆటకు విరామం తీసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా టీమ్ఇండియాతో సిరీస్ నాటికి తాజాగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Samit Dravid : ఓరీ నాయనో.. రాహుల్ ద్రవిడ్ కొడుకు కొట్టిన భారీ సిక్సర్ చూశారా..?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి వరుసగా కమిన్స్ అన్ని మ్యాచులు, సిరీస్‌లు ఆడుకుంటూ వస్తున్నాడు. అతడి నాయకత్వంలోఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ విజేతగా నిలిచింది. అంతేనా వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇలాగనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని కైవసం చేసుకోవాలని కమిన్స్ భావిస్తున్నాడు. ఫాక్స్ స్పోర్ట్స్‌తో అతడు మాట్లాడుతూ.. ‘కొంచెం విరామం తరువాత ఎవరైనా సరే తాజాగా కనిపిస్తారు. అందుకని ఆటకు దూరం అయ్యానని బాధపడాల్సిన అవసరం లేదు.
గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ నుంచి సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తున్నాను. గత 18 నెలలుగా బ్రేక్ తీసుకోలేదు. 7 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకుంటాను. దీంతో వేసవిలో మళ్లీ చెలరేగేందుకు అవసరం అయిన శక్తిని పొందుతాను. ఈజీగా బౌలింగ్ చేయడంతో పాటు గాయాల పాలు అవ్వకుండా ఉంటాను.’ అని కమిన్స్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం తన లక్ష్యమని చెప్పాడు.
WI vs SA : చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్
భారత్ – ఆస్ట్రేలియా 5 మ్యాచుల టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
మొదటి టెస్టు – పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు
రెండో టెస్టు – అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి 10 వరకు
మూడో టెస్టు – బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి 18 వరకు
నాలుగో టెస్టు – మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు
ఐదో టెస్టు – సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు