Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కోరిక తీర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్..! తలైవా ఫుల్ హ్యాపీ..!
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 21, 2024 / 12:52 PM IST
Viral video of Rajinikanth requesting SRH owner to make Kavya Maran happy by picking a strong team for IPL
Rajinikanth – Kavya Maran : ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. ఈ జట్టు బ్యాటర్ల విధ్వంసం మామూలుగా లేదు. ఈ సీజన్‌కు ముందు వరకు ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరును ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ మూడు సార్లు దాటడం ఆ జట్టు పెను విధ్వంసానికి నిదర్శనం. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లు అన్ని వణికిపోతున్నాయి. టీ20ల్లో 250 ఫ్లస్ స్కోర్లను అలవోకగా బాదేస్తోంది.
ఇక శనివారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మామూలుగా ఆడలేదు. హైలెట్స్ చూస్తున్నామన్న భావన కలిగించేలా ఆ జట్టు బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. పురుషుల టీ20 క్రికెట్లో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది.
Virat Kohli : కొద్ది గంటల్లో కేకేఆర్‌తో మ్యాచ్.. కోహ్లి బ్యాట్ విరగొట్టిన రింకూ సింగ్..
ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89; 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు), అభిషేక్ శర్మ (46; 12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు)లతో పాటు షాబాద్ అహ్మద్ (59నాటౌట్; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ 67 పరుగుల తేడాతో గెలిచింది.
తీరిన రజినీకాంత్ కోరిక..!
ఐపీఎల్ 2023లో పేలవ ప్రదర్శనతో అట్టగుడు స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్ జట్టు ఐపీఎల్ 2024లో అదగొడుతుండడంతో ఆ జట్టు యజమాని కావ్యా మారన్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. గత సీజన్లలో హైదరాబాద్ ఓడిన ప్రతీసారి స్టేడియంలో కావ్యా పాప కన్నీళ్లు పెట్టుకుంది. ఇది ఎందరో అభిమానుల మనసులను కలిచి వేసింది. అంతేనా సూపర్ స్టార్ రజినీకాంత్ హృదయాన్ని కూడా తాకింది.
MS Dhoni : ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ చెప్పిన ఫ్లెమింగ్.. ఇలాగైతే తలాను చూసేది ఎలా?
Kavya Maran
కావ్యా మారన్ బాధ చూడలేకపోతున్నానని రజినీకాంత్ జైలర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో వ్యాఖ్యానించాడు. ఆమె ఏడుస్తుంటే చూడలేక ఛానల్ సైతం మారుస్తున్నట్లు వెల్లడించాడు. మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని, జట్టును బలోపేతం చేయాలని కళానిధి మారన్‌కు అప్పుడు రజినీకాంత్ సలహా ఇచ్చాడు.
తాజాగా ఎస్ఆర్హెచ్ సంచలన ఆటతీరుతో దుమ్ములేపుతుండడంతో రజినీకాంత్ అప్పట్లో మాట్లాడిన వీడియో మరోసారి వైరల్‌గా మారింది. కావ్యా మారన్ ను సంతోషంగా చూడాలన్న సూపర్ స్టార్ రజినీకాంత్ కోరిక ఇప్పుడు తీరినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
