MS Dhoni : ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ చెప్పిన ఫ్లెమింగ్‌.. ఇలాగైతే త‌లాను చూసేది ఎలా?

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆట‌గాడు మ‌హేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

MS Dhoni : ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ చెప్పిన ఫ్లెమింగ్‌.. ఇలాగైతే త‌లాను చూసేది ఎలా?

pic credit @csk twitter

Ms Dhoni Ipl 2024 : టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆట‌గాడు మ‌హేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మూడేళ్ల క్రిత‌మే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన మ‌హేంద్రుడు ప్ర‌స్తుతం ఐపీఎల్ మాత్ర‌మే ఆడుతున్నాడు. ఇదే అత‌డికి చివ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో చెన్నై జ‌ట్టు మ్యాచ్ ఆడే స్టేడియాలు మొత్తం కిక్కిరిసిపోతున్నాయి.

ఈ సీజ‌న్‌లో ఆఖ‌ర్లో బ్యాటింగ్‌కు వ‌స్తున్న‌ ధోని దూకుడుగా ఆడుతూ జ‌ట్టుకు భారీ స్కోర్లు అందించ‌డంలో త‌న వంతు సాయం చేస్తున్నాడు. తాజాగా ల‌క్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ 9 బంతుల‌ను ఎదుర్కొన్న అత‌డు 28 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ సీజ‌న్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన మ‌హేంద్రుడు 87 ప‌రుగులు చేశాడు. దూకుడుగా ఆడుతున్న ధోనిని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు పంపాల‌ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

LSG vs CSK : జేబులో ఏం పెట్టుకుని వ‌చ్చావ్.. నాకు చూపించు దూబే..

దీనిపై ఎట్ట‌కేల‌కు సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. యువ క్రికెట‌ర్ల‌కు ధోని స్పూర్తి అని చెప్పాడు. ఈ సీజ‌న్‌లో అత‌డు ఆడుతున్న విధానం బాగుందన్నాడు. అయితే.. దీన్ని చూసి తాము ఆశ్చ‌ర్య‌పోవ‌డం లేదన్నాడు. ఎందుకంటే నెట్స్‌లోనూ అత‌డు ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాడన్నారు.

మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్న ధోని గ‌త ఐపీఎల్ ముగిసిన త‌రువాత శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. అత‌డు ఇంకా నొప్పితోనే బాధ‌ప‌డుతున్న‌ట్లుగా ఫ్లెమింగ్ చెప్పాడు. పూర్తి స్థాయిలో కోలుకునేందుకు మ‌రింత స‌మ‌యం ప‌డుతున్నాడు. ఈ కార‌ణంతోనే రెండు లేదా మూడు ఓవ‌ర్లు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే అత‌డు బ్యాటింగ్‌కు దిగుతున్నాడు అని ఫ్లెమింగ్ అన్నాడు.

Tom Moody : టీమ్ఇండియాను హెచ్చ‌రించిన టామ్ మూడీ.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు అత‌డొద్దు..

ఫ్లెమింగ్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే.. ధోని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు రావ‌డం దాదాపుగా అసాధ్యంగానే క‌నిపిస్తోంది. చెన్నై జ‌ట్టు త్వ‌ర‌గా వికెట్లు కోల్పోతే త‌ప్ప ధోని మిగిలిన ఐపీఎల్ మ్యాచుల్లో బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుకు అనేది జ‌ర‌గ‌ని ప‌ని.