LSG vs CSK : జేబులో ఏం పెట్టుకుని వచ్చావ్.. నాకు చూపించు దూబే..
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Umpire Anil Chaudhary checks Shivam Dube pocket during LSG vs CSK Match
Lucknow Super Giants vs Chennai Super Kings : లక్నోలోని ఏకాన స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ సీజన్‌లో చెన్నై తరుపున అదరగొడుతున్న శివమ్ దూబే బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చిన సమయంలో ఇది చోటు చేసుకుంది. అతడి జేబులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరీ చెక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో దూబె మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అంపైర్ ఎందుకు ఇలా చేశాడు.?
ఆటగాళ్లు జేబులను అంపైర్లు చెక్ చేయడం అన్న సంగతి అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. దూబే ప్యాంట్ జేబులో ఏదో ఉందన్న అనుమానం రావడంతోనే అంపైర్ ఇలా చెక్ చేయడం జరిగింది. ప్లేయర్లు బంతి స్వరూపాన్ని మార్చేందుకు తమతో పాటు ఏమైన వస్తువులు తీసుకువచ్చారు ఏమో అన్న అనుమానం వచ్చిన సందర్భాల్లో ఇలా చేస్తుంటారు.
Tom Moody : టీమ్ఇండియాను హెచ్చరించిన టామ్ మూడీ.. టీ20 వరల్డ్ కప్‌కు అతడొద్దు..
ఈ కారణంతోనే దూబే ప్యాంటు జేబులను అంపైర్ చెక్ చేశాడా? లేదంటే మరో కారణం ఏదైన ఉందా? అన్న సంగతి తెలియరాలేదు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇంతకీ దూబె ప్యాంటులో ఏం దొరికింది అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
What’s happening here between the umpire and #ShivamDube?#IPL2024 #CSKvsLSG #MSDhoni #Thala #Mahi #Yellove #WhistlePodu pic.twitter.com/Q5AZ5z1Rn1
— Run Chase HQ (@runchaseHQ) April 19, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57నాటౌట్), రహానే (36), మోయిన్ (30), ధోని (28నాటౌట్) రాణించారు. లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (82), క్వింటన్ డికాక్ (54) లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
IPL 2024 : ధోనీ బ్యాటింగ్‌కు వస్తుంటే భయమేస్తుంది..! లక్నో స్టార్ ప్లేయర్ సతీమణి ఆసక్తికర పోస్ట్
What Umpire is checking on the Shivam Dube’s Pocket? pic.twitter.com/xi4ipbWyNR
— Jay Cricket. (@Jay_Cricket18) April 19, 2024