IPL 2024 : ధోనీ బ్యాటింగ్‌కు వ‌స్తుంటే భయమేస్తుంది..! లక్నో స్టార్ ప్లేయర్ సతీమణి ఆసక్తికర పోస్ట్

ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడింది. అందులో ఐదు మ్యాచ్ లలో ధోనీ చివరిలో బ్యాటింగ్ వచ్చి పరుగుల వరద పారించాడు. అతను మొత్తం 30 బంతులు ఎదుర్కొని

IPL 2024 : ధోనీ బ్యాటింగ్‌కు వ‌స్తుంటే భయమేస్తుంది..! లక్నో స్టార్ ప్లేయర్ సతీమణి ఆసక్తికర పోస్ట్

MS Dhoni

IPL 2024 MS Dhoni : టీమిండియా మాజీ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు వినిపిస్తే చాలు క్రికెట్ అభిమానుల్లో అభిమానం ఉప్పొంగుతుంది. ధోనీ బ్యాట్ పట్టుకొని స్టేడియంలోకి వచ్చాడంటే టీవీలకు అతక్కుపోతుంటారు. ఆ సమయంలో మనం స్టేడియంలో ఉంటే ఆ మజానే వేరు. ధోనీ.. ధోనీ అంటూ బిగ్గరగా కేకలు వేయటమే. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్ లో ధోనీ క్రేజ్ మామూలుగా లేదు. ధోనీ బ్యాటింగ్ కు వస్తున్నాడంటే స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో మారుమోగిపోతుంది. అతడు క్రీజులో ఉన్నంత సేపు స్టేడియం మొత్తం దద్దరిల్లాల్సిందే.

Also Read : IPL 2024 : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ

ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడింది. అందులో ఐదు మ్యాచ్ లలో ధోనీ చివరిలో బ్యాటింగ్ వచ్చి పరుగుల వరద పారించాడు. అతను మొత్తం 30 బంతులు ఎదుర్కొని 290 స్ట్రైక్ రేట్ తో 87 పరుగులు చేశాడు. శుక్రవారం రాత్రి చెన్నై వర్సెస్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ చివరిలో బ్యాటింగ్ కు వచ్చి తొమ్మిది బంతుల్లో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ నాటౌట్ గానే ఉన్నాడు. ఈ మ్యాచ్ లోనూ ధోనీ బ్యాటింగ్ కు వచ్చే సమయంలో ప్రేక్షకులు ధోనీ నామస్మరణతో స్టేడియాన్ని హోరెత్తించారు.

Also Read : IPL 2024 : ఒక్కసారి కూడా ఔట్ కాలేదు..! లక్నో జట్టుపై ధోనీ విధ్వంసకర బ్యాటింగ్.. వీడియో వైరల్

స్టేడియంలో ధోనీ క్రేజ్ ను ప్రత్యక్షంగా చూసిన లక్నో జట్టు స్టార్ ప్లేయర్ క్వింటాన్ డికాక్ సతీమణి సాషా డికాక్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో ధోనీ గురించి ఆసక్తికర పోస్టు పెట్టారు. ధోనీ బ్యాటింగ్ కు వస్తున్నప్పుడు నా స్మార్ట్ వాచ్ లో నమోదైన దృశ్యమిది అంటూ.. ఆమె స్మార్ట్ వాచ్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ధోనీ బ్యాట్ తో స్టేడియంలోకి రాగానే ప్రేక్షకులు నినాదాలతో శబ్ధాల స్థాయి 95 డెసిబల్స్ కు చేరింది. ఇలాగే ఓ పది నిమిషాలు కొనసాగితే తాత్కాలికంగా వినికిడి కోల్పోతాం అని సాషా స్మార్ట్ వాచ్ లో నమోదైంది. ధోనీ మైదానంలోకి వస్తుంటే ఈ శబ్దస్థాయి ఒక్కోసారి 125 డెసిబల్స్ కుపైగా నమోదవుతున్నట్లు టీవీ తెరల్లో కనిపిస్తుంది. తాజాగా సాషా పోస్టును చూసిన నెటిజన్లు… మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.