IPL 2024 : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్ మధ్య ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో ..

IPL 2024 : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ

Ruturaj Gaikwad and KL Rahul

Updated On : April 20, 2024 / 2:33 PM IST

IPL 2024 LSG vs CSK : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్ మధ్య ఎకానా స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సొంతగడ్డపై ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నై జట్టును ఓడించింది. లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57) పరుగులు చేశాడు. చివర్లో ధోనీ సిక్సులు, ఫోర్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో తొమ్మిది బంతుల్లో 28 పరుగులు చేశాడు. 177 పరుగుల లక్ష్యంతో లక్నో జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా.. డికాక్ (54), కేఎల్ రాహుల్ (82) రాణించడంతో 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్నో జట్టు 180 పరుగులు చేసి విజయం సాధించింది.

Also Read : IPL 2024 : ఒక్కసారి కూడా ఔట్ కాలేదు..! లక్నో జట్టుపై ధోనీ విధ్వంసకర బ్యాటింగ్.. వీడియో వైరల్

ఈ మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్లు కేఎల్ రాహుల్, రితురాజ్ గైక్వాడ్ లకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఇద్దరికి జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం రాహుల్, గైక్వాడ్ లు చేసిన మొదటి తప్పుకారణంగా.. ఇద్దరికీ చెరో రూ. 12లక్షలు జరిమానాను విధించింది. మళ్లీ ఇలాంటి తప్పిదానికి పాల్పడితే ఫైన్ రెట్టింపు కానుంది. ఇప్పటికే ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లకు కూడా జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Also Read : IPL 2024 : ధోనీ బ్యాటింగ్‌కు వ‌స్తుంటే భయమేస్తుంది..! లక్నో స్టార్ ప్లేయర్ సతీమణి ఆసక్తికర పోస్ట్