IPL 2024 : ఒక్కసారి కూడా ఔట్ కాలేదు..! లక్నో జట్టుపై ధోనీ విధ్వంసకర బ్యాటింగ్.. వీడియో వైరల్

తొలుత ఒక్క పరుగుతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ధోనీ.. 19వ ఓవర్లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఓవర్ ను మొహిసిన్ ఖాన్ వేశాడు. తొలి రెండు బంతులు వైడ్ వేయగా.. ఆ తరువాత ధోనీ తొలి బంతిని ..

IPL 2024 : ఒక్కసారి కూడా ఔట్ కాలేదు..! లక్నో జట్టుపై ధోనీ విధ్వంసకర బ్యాటింగ్.. వీడియో వైరల్

MS Dhoni

IPL 2024 MS Dhoni : ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై దూకుడుకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బ్రేక్ వేసింది. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో జట్టు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 19 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేశారు. దీంతో ఆరు బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నైపై లక్నో జట్టు విజయం సాధించింది. అయితే, చెన్నై బ్యాటింగ్ సమయంలో చివరిలో వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ విధ్వంసం సృష్టించాడు. కేవలం తొమ్మిది బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : IPL 2024 : అద్భుత క్యాచ్‌తో కేఎల్ రాహుల్ సెంచరీని అడ్డుకున్న జడేజా.. ధోనీ ఏం చేశాడంటే? వీడియో వైరల్

18వ ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. తొలుత ఒక్క పరుగుతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ధోనీ.. 19వ ఓవర్లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఓవర్ ను మొహిసిన్ ఖాన్ వేశాడు. తొలి రెండు బంతులు వైడ్ వేయగా.. ఆ తరువాత ధోనీ తొలి బంతిని బౌండరీ లైన్ కు పంపాడు. రెండో బంతిని సిక్స్ కొట్టాడు. ఆ తరువాత ఓవర్లోనూ ధోనీ బ్యాట్ ను ఝుళిపించాడు. చివరి ఓవర్లో మూడో బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. తరువాత బంతిని బౌండరీ లైన్ దాటించాడు. దీంతో తొమ్మిది బంతుల్లోనే 311 స్ట్రైక్ రేట్ తో ధోనీ మూడు ఫోర్లు, రెండు సిక్సులతో 28 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ధోనీ చివరి ఓవర్లో కొట్టిన సిక్స్ 101 మీటర్లు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : IPL 2024 : హాఫ్ సెంచరీలతో డికాక్, రాహుల్ వీరవిహారం.. చెన్నైపై లక్నో విజయదుంధుభి

మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్ లో చివర్లో బ్యాటింగ్ కు వస్తూ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మెరుపు షాట్లతో చివర్లో స్కోర్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడగా.. ధోనీ ఐదు మ్యాచ్ లలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ సీజన్లో ధోనీ ఒక్క మ్యాచ్ లోనూ ఔట్ కాలేదు. నాటౌట్ గా పెవిలియన్ కు చేరాడు. ఈ సీజన్ లో మొత్తం 30 బంతులు ఎదుర్కొన్న మహేంద్ర సింగ్ ధోనీ.. 290 స్ట్రైక్ రేట్ తో 87 పరుగులు చేశాడు.