IPL 2024 : అద్భుత క్యాచ్‌తో కేఎల్ రాహుల్ సెంచరీని అడ్డుకున్న జడేజా.. ధోనీ ఏం చేశాడంటే? వీడియో వైరల్

జడేజా గాల్లోకి ఎగిరి అద్భుత క్యాచ్ అందుకోవడంతో ధోనీసైతం ఆశ్చర్యపోయాడు. జడేజాను అభినందిస్తూనే.. అతన్ని దగ్గరకు పిలిచి బాల్ భూమిని తాకిందా అని ప్రశ్నించాడు..

IPL 2024 : అద్భుత క్యాచ్‌తో కేఎల్ రాహుల్ సెంచరీని అడ్డుకున్న జడేజా.. ధోనీ ఏం చేశాడంటే? వీడియో వైరల్

Jadeja

IPL 2024 LSG vs CSK : ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై దూకుడుకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కళ్లెం వేసింది. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 19 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేశారు. దీంతో ఆరు బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నైపై లక్నో జట్టు విజయం సాధించింది. లక్నో విజయంలో కేఎల్ రాహుల్ (82), డికాక్ (54) కీలక భూమిక పోషించారు. అయితే, రాహుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సమయంలో రవీంద్ర జడేజా అద్భుత క్యాచ్ తో పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది.

Also Read : IPL 2024 : హాఫ్ సెంచరీలతో డికాక్, రాహుల్ వీరవిహారం.. చెన్నైపై లక్నో విజయదుంధుభి

లక్నో జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 18వ ఓవర్ ను మతిషా పతిరనా వేశాడు. కేఎల్ రాహుల్ పాయింట్ నుంచి షాట్ ఆడాడు. జడేజా అక్కడే నిలబడి గాలిలో ఎడమవైపు దూకి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. జడేజా అద్భుతమైన క్యాచ్ తో ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మారుమోగిపోయింది. నెమ్మదిగా సెంచరీ పూర్తిచేసుకుందామనుకున్న రాహుల్ కు అద్భుత క్యాచ్ రూపంలో జడేజా షాకిచ్చాడు. అయితే, జడేజా క్యాచ్ సమయంలో బాల్ నేలను తాకిందనే అనుమానంతో రాహుల్ రివ్యూ కోరాడు. టీవీ అంపైర్ జడేజా పట్టిన క్యాచ్ ను పలు దఫాలుగా క్షుణ్ణంగా పరిశీలించి బాల్ భూమికి తాకలేదని నిర్ధారించి అవుట్ గా ప్రకటించారు. దీంతో రాహుల్ మైదానం వీడాడు.

 

Ravindra Jadeja and MS Dhoni

జడేజా గాల్లోకి ఎగిరి అద్భుత క్యాచ్ అందుకోవడంతో ధోనీసైతం ఆశ్చర్యపోయాడు. జడేజాను అభినందిస్తూనే.. క్యాచ్ ఎలా అందుకున్నావు, భూమిని తాకిందా అని ప్రశ్నించాడు. దీంతో జడేజా క్యాచ్ ని పట్టుకున్న విధానాన్ని రీక్రియేట్ చేసి క్యాచ్ ఎలా తీసుకున్నాడో చెప్పాడు. క్యాచ్ తీసుకున్న విధానాన్ని ధోనీకి జడేజా వివరిస్తున్న సమయంలో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని తరువాత టీవీ అంపైర్ కూడా రాహుల్ అవుట్ గా ప్రకటించాడు.