Tom Moody : టీమ్ఇండియాను హెచ్చరించిన టామ్ మూడీ.. టీ20 వరల్డ్ కప్‌కు అతడొద్దు..
ఐపీఎల్ 17వ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లలో యువ పేసర్ మయాంక్ యాదవ్ ఒకడు.

PIC credit @ LSG
Mayank Yadav – Tom Moody : ఐపీఎల్ 17వ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లలో యువ పేసర్ మయాంక్ యాదవ్ ఒకడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన అరంగ్రేటం మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కు చుక్కలు చూపించాడు. మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 156.7Kmph వేగంతో బంతిని విసిరి ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు.
మూడు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో అతడిని ఐపీఎల్ అనంతరం ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024కి ఎంపిక చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ మాత్రం అతడి ఎంపికను వ్యతిరేకిస్తున్నాడు. అతడిని ఎంపిక చేయొద్దు అంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. అతడిని 2026 ప్రపంచకప్ కోసం సిద్ధం చేయాలని సూచించాడు.
IPL 2024 : ధోనీ బ్యాటింగ్‌కు వస్తుంటే భయమేస్తుంది..! లక్నో స్టార్ ప్లేయర్ సతీమణి ఆసక్తికర పోస్ట్
తొలి రెండు మ్యాచుల్లో అతడి ప్రదర్శన బాగుంది. అయితే.. రెండు మ్యాచులు మాత్రమే ఆడి అతడు గాయపడ్డాడు. అలాంటి ఆటగాడిని ప్రపంచ కప్‌కు ఎంపిక చేయాలనుకోవడం సరియైన నిర్ణయం కాదని మూడీ అన్నాడు. ఒత్తిడిలో అతడు ఎలా రాణిస్తాడు సంగతి తెలియదు. అలాంటి ఆటగాడిని టీ20 ప్రపంచకప్ 2024కి ఎంపిక చేయాలనుకోవడం సరికాదు. అదే సమయంలో అతడు భారత జట్టుకు లభించిన ఓ గొప్ప ఆస్తి. అతడిని 2026 టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధం చేసుకుంటే బాగుంటుందని అని టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు.
ఎకానా క్రికెట్ స్టేడియంలోగుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ కేవలం ఒక ఓవర్ బౌలింగ్ చేసిన తర్వాత గాయంతో మైదానాన్ని వీడాడు. ఈ ఓవర్‌లో 13 పరుగులు ఇచ్చాడు.
అయితే.. గాయం నుంచి అతడు కోలుకున్నట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. అతడి విషయంలో తొందర పడడం లేదని, 100 శాతం ఫిట్‌నెస్ సాధించిన తరువాతే మైదానంలో అడుగుపెడతాడన్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో మయాంక్ ఆడతాడని అందరూ భావించగా ఆడలేదు.
IPL 2024 : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ