Ranji Trophy: రెండేళ్ల విరామం తర్వాత రంజీ ట్రోఫీ రీ ఎంట్రీ

టీమిండియా క్రికెట్ వెన్నెముక రంజీ ట్రోఫీ రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలైంది. దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదురుకుంటున్న రీత్యా.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ...

Ranji Trophy: టీమిండియా క్రికెట్ వెన్నెముక రంజీ ట్రోఫీ రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలైంది. దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదురుకుంటున్న రీత్యా.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ దేశీవాలీ క్రికెటర్ల కోసం రంజీట్రోఫీని మళ్లీ ఆరంభించారు. టెస్ట్ ఫార్మాట్ లో రాణిస్తున్న అజింకా రహానె, చతేశ్వర్ పూజారా లాంటి ప్లేయర్లు కూడా రంజీ మ్యాచ్ ల నుంచి వచ్చినవాళ్లే.

కొవిడ్ థర్డ్ వేవ్ రీత్యా రెండేళ్ల పాటు విరామం ఇచ్చి 38టీమ్ లతో కలిసి బయో సెక్యూర్ వాతావరణంలో మొదలుపెడుతున్నారు.

ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ సౌరాష్ట్ర, రికార్డ్ 41-టైమ్ ఛాంపియన్స్ ముంబై మధ్య మొదలుకానున్న ప్రారంభ మ్యాచ్‌పైనే అందరి ఫోకస్. రహానే.. పుజారా ప్రత్యర్థి జట్లలో ఉండి భారీ స్కోర్‌ చేయాలనే లక్ష్యంతో కనిపిస్తున్నారు. త్వరలో ప్రకటించనున్న శ్రీలంక సిరీస్‌కు టెస్టు జట్టులో సెలక్ట్ అవ్వాలంటే రహానే, పుజారాలకు ఇది చక్కని అవకాశం.

IND vs WI 1st T20: రసవత్తరపోరు.. అవేష్ ఖాన్‌కు అవకాశం వస్తుందా? భారత్ ప్లేయింగ్ XI?

 

ఆటగాళ్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని రంజీ మ్యాచ్ లు జరిగే తొమ్మిది వేదికలలో తొమ్మిది బయో-బబుల్స్ సృష్టించారు. గురువారం నుండి ప్రారంభమయ్యే మొదటి రౌండ్ కోసం రెండు రోజుల ట్రైనింగ్ మాత్రమే మిగిలి ఉంది.

మొదటి రౌండ్ మ్యాచ్‌లు:
కర్ణాటక vs రైల్వేస్, ఎలైట్ గ్రూప్ సి (చెన్నై).
హైదరాబాద్ vs చండీగఢ్, ఎలైట్ గ్రూప్ B (భువనేశ్వర్)
బెంగాల్ vs బరోడా, ఎలైట్ గ్రూప్ B (కటక్)
కేరళ vs మేఘాలయ, ఎలైట్ గ్రూప్ A (రాజ్‌కోట్)
గుజరాత్ vs మధ్యప్రదేశ్, ఎలైట్ గ్రూప్ A (రాజ్‌కోట్)
మణిపూర్ vs అరుణాచల్ ప్రదేశ్, ప్లేట్ (కోల్‌కతా)
జమ్మూ కాశ్మీర్ vs పుదుచ్చేరి, ఎలైట్ గ్రూప్ సి (చెన్నై)
సౌరాష్ట్ర vs ముంబై, ఎలైట్ గ్రూప్ డి (అహ్మదాబాద్)
ఒడిశా vs గోవా, ఎలైట్ గ్రూప్ డి (అహ్మదాబాద్)
నాగాలాండ్ vs సిక్కిం, ప్లేట్ (కోల్‌కతా)
బీహార్ vs మిజోరం, ప్లేట్ (కోల్‌కతా)
జార్ఖండ్ vs ఛత్తీస్‌గఢ్, ఎలైట్ గ్రూప్ హెచ్ (గౌహతి)
ఢిల్లీ vs తమిళనాడు, ఎలైట్ గ్రూప్ హెచ్ (గౌహతి)
మహారాష్ట్ర vs అస్సాం, ఎలైట్ గ్రూప్ జి (రోహ్‌తక్)
విదర్భ vs ఉత్తరప్రదేశ్, ఎలైట్ గ్రూప్ G (గురుగ్రామ్)
హర్యానా vs త్రిపుర, ఎలైట్ గ్రూప్ ఎఫ్ (ఢిల్లీ)
పంజాబ్ vs హిమాచల్ ప్రదేశ్, ఎలైట్ గ్రూప్ ఎఫ్ (ఢిల్లీ)
సర్వీసెస్ vs ఉత్తరాఖండ్, ఎలైట్ గ్రూప్ ఇ (తిరువనంతపురం)
ఆంధ్ర vs రాజస్థాన్, ఎలైట్ గ్రూప్ ఇ ( తిరువనంతపురం)

ట్రెండింగ్ వార్తలు