Rashid Khan: అఫ్ఘానిస్తాన్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్

అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ నిర్ణయాన్ని తెలియజేశాడు. తాను అఫ్ఘాన్‌ టీ20 జట్టు కెప్టెన్సీ ...

Rashid Khan: అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ నిర్ణయాన్ని తెలియజేశాడు. తాను అఫ్ఘాన్‌ టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌కు అప్ఘానిస్తాన్‌ క్రికెట్‌ సెలక్టర్లు.. రషీద్‌ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వరల్డ్ కప్‌లో పాల్గొనే అఫ్గాన్‌ జట్టును అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) ప్రకటించింది.

రాబోయే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం రషీద్‌ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వెటరన్ వికెట్ కీపర్ మొహమ్మద్ షాజద్ ను కూడా జట్టులో చేర్చారు. అంతేకాకుండా అఫసర్ జజై, ఫరీద్ మాలిక్ లను స్టాండ్ బై ప్లేయర్లుగా ప్రకటించారు. ఈ ప్రకటన జరిగిన కాసేపటికే టీ20 జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్‌లో ప్రకటించాడు రషీద్.

‘బాధ్యతయుతమైన జట్టు కెప్టెన్‌గా టీ20 జట్టు ఎంపికలో భాగమయ్యే హక్కు ఉంది. సెలక్షన్‌ కమిటీ, అఫ్ఘానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) కనీసం అభిప్రాయం కూడా తీసుకోకుండా.. ఎంపిక చేపట్టారు. టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఎప్పుడూ దేశం తరపున ఆడటాన్ని గర్వంగా ఫీల్‌ అవుతున్నా’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు