Rassie van der Dussen : వన్డే ప్రపంచకప్ 2027కి ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్
దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (Rassie van der Dussen) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 2, 2026 / 02:43 PM IST
Rassie van der Dussen retirement from international cricket
- అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్
- దేశవాళీ క్రికెట్‌లో మాత్రం లయన్స్‌కు ఆడతానని వెల్లడి
Rassie van der Dussen : దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలికాడు. అయితే.. 37 ఏళ్ల ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికి కూడా దేశవాళీ క్రికెట్‌లో లయన్స్ తరుపున ఆడతానని వెల్లడించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
దక్షిణాఫ్రికా జెర్సీని ధరించడం తన జీవితంలో ఓ మధురమైన క్షణం అని చెప్పుకొచ్చాడు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవం అని అన్నాడు. తన క్రికెట్ ప్రయాణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన అతి పెద్ద పురస్కారం అని తెలిపాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ కోసం తన సేవలను అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నాడు.
Virat Kohli : ఐపీఎల్ కెరీర్ గురించి ఐదు ప్రశ్నలు అడిగితే.. కోహ్లీ స్కోరు 4/5
2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ దక్షిణాఫ్రికా తరుపున 71 వన్డేలు, 18 టెస్టులు, 57 టీ20ల్లో ఆడాడు. టెస్టుల్లో 30.2 సగటుతో 905 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 50.1 సగటుతో 2657 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 17 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20ల్లో 33.5 సగటుతో 1406 పరుగులు చేశాడు. ఇందులో 10 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లోనూ డస్సెన్ మూడు మ్యాచ్‌లు ఆడాడు. 11 సగటుతో 22 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికి కూడా వన్డేల్లో మాత్రం స్టార్ ఆటగాడిగా కొనసాగాడు. మిడిల్ ఆర్డర్‌లో ఆడుతూ ఎన్నో సార్లు జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించాడు. 2027 వన్డే ప్రపంచకప్ ముందు అతడు రిటైర్‌కావడం సౌతాఫ్రికాకు ఓ రకంగా ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
