Ashwin : ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన అశ్విన్‌.. ఆస్ట్రేలియా టాస్ ప్లాన్..

Ravichandran Ashwin : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓట‌మిపై టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ స్పందించాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమ్ఇండియాకు నిరాశ త‌ప్ప‌లేదు. వ‌రుస మ్యాచుల్లో విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ ఫైన‌ల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో భార‌త్ ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది.ఈ మెగా టోర్నీలో ఒకే ఒక్క మ్యాచులో మాత్ర‌మే అశ్విన్ ఆడాడు. మిగిలిన 10 మ్యాచుల్లో బెంచీకే ప‌రిమితం అయ్యాడు. కాగా.. తాజాగా భార‌త ఓట‌మిపై టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ స్పందించాడు.

ప్ర‌పంచ‌క‌ప్‌లో తాను ఒక్క మ్యాచుకే ప‌రిమితం అవుతాన‌ని అస్స‌లు ఊహించ‌లేద‌న్నాడు. మంచి రిథ‌మ్‌తో బౌలింగ్ చేసినా తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేద‌న్నాడు. ఇక ఫైన‌ల్ మ్యాచులో ఆస్ట్రేలియా అనుస‌రించిన వ్యూహాలు త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేశాయ‌ని తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ అశ్విన్ తెలిపాడు. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Chahal : ప్ర‌ద‌ర్శ‌న‌తోనే సెల‌క్ట‌ర్ల‌ను ప్రశ్నిస్తున్న చాహ‌ల్‌..! జ‌ట్టులో త‌న‌కు చోటు ఎందుకు లేద‌ని..?

ఈ విష‌య‌మై ఆసీస్ చీఫ్ సెల‌క్ట‌ర్ జార్జ్ బెయిలీని అడుగ‌గా అత‌డు చెప్పిన స‌మాధానం విని ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు అశ్విన్ చెప్పాడు. ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో పిచ్‌ను ప‌రిశీలించాను. ఆ త‌రువాత జార్జ్ బెయిలీని క‌లిశాను. సాధార‌ణంగా మీరు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటారు గ‌దా..? ఇప్పుడు ఎందుకు ఫీల్డింగ్ తీసుకున్నారు అని అత‌డిని అడిగాను. అప్పుడు బెయిలీ మాట్లాడుతూ.. ఇక్క‌డ మేము ఐపీఎల్‌, ద్వైపాకిక్ష సిరీస్‌ల‌ను ఆడాము. ఎర్ర‌మ‌ట్టి పిచ్ అయితే మ్యాచ్ జ‌రిగే కొద్ది విచ్చిన్నం అవుతంది. న‌ల్ల‌మ‌ట్టితో త‌యారు చేసిన పిచ్ అయితే అలా ఉండ‌ద‌ని చెప్పాడు.

న‌ల్ల‌మ‌ట్టి పిచ్ పై మ‌ధ్యాహ్నా స‌మ‌యంలో ట‌ర్నింగ్ ఉంటుంది. అదే రాత్రి స‌మ‌యంలో కాంక్రిట్‌లా గ‌ట్టిగా మారిపోతుంది. లైట్ల కింద చాలా బాగుంటుంద‌ని బెయిలీ చెప్పాడు. ఈ స‌మాధానం విని విస్తుపోయాన‌ని అశ్విన్ తెలిపాడు.

T20 World Cup 2024 : టీ20ల‌కు హార్దిక్‌పాండ్య కెప్టెన్‌గా వ‌ద్దు.. అందుకు స‌రైనోడు అత‌డే : గంభీర్

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ట్రావిస్ హెడ్ అద్భుత శ‌త‌కం బాద‌డంతో ల‌క్ష్యాన్ని ఆసీస్ 43 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేధించింది. త‌ద్వారా ఆరో సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవసం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు