Ravichandran Ashwin : వందో టెస్టులో అద‌ర‌గొట్టిన అశ్విన్‌.. అనిల్ కుంబ్లే రికార్డు బ‌ద్ద‌లు.. తొలి భార‌తీయుడిగా..

ధ‌ర్మ‌శాల టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

Ravichandran Ashwin shatters records with 36th fifer in 100th Test

Ravichandran Ashwin 100th Test : ధ‌ర్మ‌శాల టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 9 వికెట్లు తీసి అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల‌తో ఇంగ్లాండ్ న‌డ్డివిరిచాడు. అశ్విన్ కెరీర్‌లో ఇది వందో టెస్ట్ మ్యాచ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వందో టెస్టులో ఐదు వికెట్లు ప‌డ‌గొట్టిన రెండో భార‌త ఆట‌గాడిగా నిలిచాడు.

అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే ఈ ఘ‌న‌త అందుకున్నాడు. 2005లో కుంబ్లే శ్రీలంక పై 89 ప‌రుగులు ఇచ్చి ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. స్పిన్ దిగ్గ‌జాలు ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌, షేన్ వార్న్‌లు కూడా త‌మ వందో టెస్టు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీశారు. ద‌క్షిణాఫ్రికా పై వార్న్ (6/161), బంగ్లాదేశ్ పై ముర‌ళీధ‌ర‌న్ (6/54) లు ఘ‌న‌త సాధించారు.

BCCI : భార‌త‌ టెస్టు క్రికెట‌ర్ల పంట పండింది.. ఒక్కొ మ్యాచ్‌కు రూ.45 ల‌క్ష‌ల వ‌ర‌కు

కుంబ్లే రికార్డు బ‌ద్ద‌లు..

రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ బెన్‌డ‌కెట్ (0), జాక్ క్రాలే (2), ఓలీపోప్ (19), బెన్‌స్టోక్స్ (2), బెన్‌ఫోక్స్ (8)ల‌ను ఔట్ చేసి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. దీంతో భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ అనిల్ కుంబ్లే రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. టెస్టుల్లో అత్య‌ధిక సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన భార‌త ఆట‌గాడిగా నిలిచాడు. కుంబ్లే త‌న కెరీర్‌లో 35 సార్లు 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. తాజా ప్ర‌ద‌ర్శ‌న‌తో అశ్విన్ 36 సార్లు ఈ ఘ‌న‌త‌ను సాధించాడు.

WTC Points table : ఐదో టెస్టులో ఇంగ్లాండ్ పై విజ‌యం.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భార‌త అగ్ర‌స్థానం ప‌దిలం

ట్రెండింగ్ వార్తలు