BCCI : భార‌త‌ టెస్టు క్రికెట‌ర్ల పంట పండింది.. ఒక్కొ మ్యాచ్‌కు రూ.45 ల‌క్ష‌ల వ‌ర‌కు

ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో టీమ్ఇండియా సొంతం చేసుకుంది.

BCCI : భార‌త‌ టెస్టు క్రికెట‌ర్ల పంట పండింది.. ఒక్కొ మ్యాచ్‌కు రూ.45 ల‌క్ష‌ల వ‌ర‌కు

BCCI announces Test cricket incentive of upto Rs 45 lakh per match

BCCI – Test cricket incentive : ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో టీమ్ఇండియా సొంతం చేసుకుంది. ఈ ఆనంద‌క‌ర స‌మ‌యంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్ర‌ట‌రీ జై షా ఓ శుభ‌వార్త చెప్పాడు. టెస్టు క్రికెట్ ఆడే ఆట‌గాళ్ల‌ను ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ ను ప్ర‌వేశ‌పెట్టారు.

ఈ స్కీమ్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంద‌ని, టెస్టు క్రికెట్ ఆడే మ‌న క్రికెట‌ర్ల ఆర్థిక పురోగ‌తి కోసం ఈ స్కీమ్ తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. 2022-2023 సీజ‌న్‌ను నుంచి ఈ స్కీమ్‌ను అమ‌ల్లోకి రానుంద‌న్నారు. ఈ స్కీమ్ కింద టెస్టు ఆడే క్రికెట‌ర్ల‌కు అద‌న‌పు ఆధాయం స‌మ‌కూర‌నున్న‌ట్లు తెలిపారు.

Also Read : ఐదో టెస్టులో ఇంగ్లాండ్ పై విజ‌యం.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భార‌త అగ్ర‌స్థానం ప‌దిలం

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఒక్కో టెస్టు క్రికెటర్‌కు ప్రస్తుతం రూ.15 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లిస్తోంది. టెస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్‌లో భాగంగా భారత్ తరఫున ఒక సీజన్‌లో 75 శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడే ఆటగాళ్లు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు రూ. 45 లక్షల అదనపు ఆదాయాన్ని అందుకోనున్నారు. 50 శాతం మ్యాచ్ లు ఆడిన ఆట‌గాళ్ల‌కు రూ.35ల‌క్ష‌లు ఇవ్వ‌నుంది. ఇక బెంచీ మీద ఉండే ఆట‌గాళ్ల‌కు రూ.15ల‌క్ష‌ల నుంచి రూ.22.5ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించ‌నున్నారు. ఈ పథకం కోసం బీసీసీఐ ఒక్కో సీజన్‌కు అదనంగా రూ.40 కోట్లు కేటాయించింది.

దేశీయ టోర్న‌మెంట్లు ముఖ్యంగా రంజీ ట్రోఫీకి ప్రాధాన్యం ఇవ్వాల‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా ఆట‌గాళ్లు చెప్పిన కొద్ది రోజుల త‌రువాత టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి శ్రేయ‌స్ అయ్య‌ర్, ఇషాన్ కిష‌న్‌లు రంజీలు ఆడేందుకు నిరాక‌రించ‌గా వారిద్ద‌రి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 2023 నుంచి ఇషాన్ కిష‌న్ పోటీ క్రికెట్ ఆడ‌లేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో చివ‌రి మూడు టెస్టుల‌కు శ్రేయ‌స్‌కు తొల‌గించారు.

Also Read : అరెయ్‌.. అక్క‌డ కాదురా.. ఇక్క‌డ నిలుచోవాలి.. చెప్పేది అర్థం చేసుకో..!