IND vs ENG : అరెయ్‌.. అక్క‌డ కాదురా.. ఇక్క‌డ నిలుచోవాలి.. చెప్పేది అర్థం చేసుకో..!

షార్ట్ లెగ్ పొజిష‌న్‌లో నిల‌బ‌డాల‌ని స‌ర్ఫ‌రాజ్‌కు రోహిత్ శ‌ర్మ సూచించాడు.

IND vs ENG : అరెయ్‌.. అక్క‌డ కాదురా.. ఇక్క‌డ నిలుచోవాలి.. చెప్పేది అర్థం చేసుకో..!

IND vs ENG 5th Test Rohit Sharma Puts Sarfaraz Khan In Right Place

IND vs ENG 5th Test : రాక రాక వ‌చ్చిన అవ‌కాశాన్ని యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ రెండు చేతుల‌తో ఒడిసిప‌ట్టుకున్నాడు. ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు అర్ధ‌శ‌త‌కాలు బాది ఇన్నాళ్లు త‌న‌ను జ‌ట్టులోకి ఎందుకు తీసుకోలేదు అని చింతించేలా చేశాడు. బ్యాటింగ్‌లో రాణిస్తున్న స‌ర్ఫ‌రాజ్ తొలి సారి టీమ్ఇండియా త‌రుపున ఆడుతుండ‌డంతో స‌రియైన ఫీల్డింగ్ ప్లేస్ మెంట్‌లో నిల‌బ‌డ‌డం కాస్త క‌ష్టంగా మారింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తూ ఎక్క‌డ నిలుచోవాల‌నే విష‌యాల‌ను ఎంతో ఒపిక‌తో వివ‌రిస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ధ‌ర్మ‌శాల టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఆ వీడియోలో ఉంది. షార్ట్ లెగ్ పొజిష‌న్‌లో నిల‌బ‌డాల‌ని స‌ర్ఫ‌రాజ్‌కు రోహిత్ శ‌ర్మ సూచించాడు. అయితే.. స‌ర్ఫ‌రాజ్ ఆ స్థానంలో కాకుండా కాస్త ప‌క్క‌కు నిలుచుకున్నాడు.

James Anderson : చ‌రిత్ర సృష్టించిన జేమ్స్ అండ‌ర్స‌న్‌.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

దీన్ని గ‌మ‌నించిన రోహిత్ శ‌ర్మ వెంట‌నే అత‌డి వ‌ద్ద‌కు వ‌చ్చి భుజాల‌పై చేతులు వేసి అత‌డ‌ని రెండు అడుగులు వెనక్కు నెట్టి.. ఇక్క‌డ నిల‌బ‌డాలి అని చెప్పాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం రోహిత్ శ‌ర్మ‌(103), శుభ్‌మ‌న్ గిల్ (110) శ‌త‌కాల‌కు తోడు దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (65), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (56) లు అర్థ‌శ‌త‌కాలు బాద‌డంతో మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త్ 477 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్‌కు కీల‌క‌మైన 259 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. మూడో రోజు ఆట‌లో లంచ్ విరామానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 103 ప‌రుగులు చేసింది. జోరూట్ (34), బెన్‌ఫోక్స్ (0) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా భార‌త స్కోరుకు 156 ప‌రుగులు వెనుక‌బడి ఉంది.