Ravichandran Ashwin : 500 నుంచి 501 వికెట్ల మధ్య చాలా జరిగింది..! అశ్విన్ భార్య భావోద్వేగ పోస్ట్‌

అశ్విన్ టెస్టుల్లో 500 నుంచి 501వ వికెట్ మధ్య ఎదుర్కొన్న కుటుంబ అత్యవసర పరిస్థితిని ప్రీతి నారాయణన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ పోస్ట్ ను పంచుకున్నారు.

Ravichandran Ashwin

Prithi narayanan : రాజ్‌కోట్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత జట్టు వెటరన్ స్పిన్ బౌలర్ రవిచంద్ర అశ్విన్ కు రాజ్‌కోట్‌ మ్యాచ్ చాలా ప్రత్యేకమైనదిగా నిలిచింది. దీనికి కారణం.. అశ్విన్ టెస్టు క్రికెట్ లో 500 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు. అయితే, మ్యాచ్ మధ్యలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా జట్టును వీడి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. మరుసటి రోజే అశ్విన్ తిరిగొచ్చి జట్టులో చేరాడు. అశ్విన్ 500 వికెట్లు మైలురాయిని చేరుకోవటం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా అశ్విన్ 500 టెస్టు వికెట్లపై ఆయన సతీమణి ప్రతీనారాయణన్ భావోద్వేగపూరితమైన పోస్టు చేశారు.

Also Read : Ravichandran Ashwin : ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో 500 వికెట్ల క్ల‌బ్‌లో చోటు

అశ్విన్ టెస్టుల్లో 500 నుంచి 501వ వికెట్ మధ్య ఎదుర్కొన్న కుటుంబ అత్యవసర పరిస్థితిని ప్రీతి నారాయణన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ పోస్ట్ ను పంచుకున్నారు. ‘హైదరాబాద్ లో జరిగిన మొదటి టెస్టులో అశ్విన్ 500 వికెట్లు పూర్తిచేస్తాడని ఊహించాం. అది జరగలేదు. ఆ తరువాత వైజాగ్ లో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా అతను 500 వికెట్లు చేరుకోవటంలో విఫలమయ్యాడు. అశ్విన్ 499 వికెట్లు పూర్తి చేసిన తరువాత నేను చాలా స్వీట్లు కొని ఇంట్లో అందరికీ పంచాను. కానీ, 500 వ వికెట్ రాగానే ప్రశాంతంగా సాగింది. ఇప్పటి వరకు ఇలా జరగలేదు. 500 నుంచి 501 వికెట్ల మధ్య చాలా జరిగాయి. ఇవి మా జీవితంలో సుదీర్ఘమైన 48 గంటలు. ఇది సుమారు 500 అయినప్పటికీ.. ఎంత అద్భుతమైన విజయం. అద్భుతమైన వ్యక్తి అశ్విన్. నేను ఎంతో గర్వపడుతున్నాను అని తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రీతి నారాయణన్ రాశారు.

Yashasvi Jaiswal : య‌శస్వి జైస్వాల్‌కు అన్యాయం జ‌రుగుతోందా? మొన్న బుమ్రా, నేడు జ‌డేజా