Ravindra Jadeja
Ravindra Jadeja: బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్, (84), జడేజా (77) పరుగులతో అర్ధ సెంచరీలు పూర్తిచేసుకొని భారత్ జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. వీరిద్దరి జోడీ ఆరో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. రవీంద్ర జడేజా ఆఫ్ సెంచరీ తరువాత తనదైన శైలిలో బ్యాట్ ను కత్తిలా తిప్పుతూ తన ఆనందాన్ని వెలుబుచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Rohit Sharma: ఆస్ట్రేలియాతో సిరీస్ తరువాత టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. నిజమెంత?
గబ్బా టెస్టు భారత్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా బ్యాట్ తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా.. 2017 నుంచి టెస్టుల్లో ఏడు లేదా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక 50ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక బ్యాటర్ గా జడేజా నిలిచాడు. రవీంద్ర జడేజా 15 ఆఫ్ సెంచరీలు చేయగా.. ఆ తరువాత స్థానంలో నిరోషన్ డిక్వెల్లా- 12 (శ్రీలంక), అఘా సల్మాన్ 11(పాకిస్థాన్), క్వింటన్ డి కాక్ -11 (దక్షిణాఫ్రికా), అలెక్స్ కారీ -10 (ఆస్ట్రేలియా)ఉన్నారు.
Also Read: IND vs AUS : రోహిత్ శర్మను ఔట్ చేసి కపిల్ దేవ్ రికార్డును సమంచేసిన పాట్ కమిన్స్
మరోవైపు.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో ఆరు, అంతకంటే ఎక్కువ 50ప్లస్ స్కోర్లు చేయడంతోపాటు 75 కంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డును జడేజా నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్ లో ఇలా చేసిన మూడో క్రికెటర్ గా జడేజా నిలిచాడు. జడేజా కంటే ముందు ఈ ఘనత సాధించిన వారిలో విల్‌ఫ్రెడ్ రోడ్స్. ఇయాన్ బోథమ్ ఉన్నారు. ఇంగ్లండ్ ఆటగాడు విల్ ప్రెడ్ రోడ్స్ ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 10సార్లు 50కుపైగా పరుగులు చేసి.. 109 వికెట్లు తీశాడు. ఇయాన్ బోథమ్ ఆస్ట్రేలియాపై 10సార్లు 50పరుగుల కంటే ఎక్కువ చేసి.. 148 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాపై మొత్తం 89 వికెట్లు పడగొట్టాడు.. అదే సమయంలో ఆరు సార్లు 50కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
Jadeja brings out his trademark sword celebration with a fine 50 at the Gabba. #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/IFOfqltJdA
— cricket.com.au (@cricketcomau) December 17, 2024