IND vs AUS : రోహిత్ శర్మను ఔట్ చేసి కపిల్ దేవ్ రికార్డును సమంచేసిన పాట్ కమిన్స్
టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తన బౌలింగ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేయడం ఇది నాల్గోసారి. దీంతో టెస్టు ఫార్మాట్ లో ..

Pat Cummins
Pat Cummins: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు నాల్గోరోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. నాల్గో రోజు (మంగళవారం) ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (10) ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్డాడు. ఈ క్రమంలో కమిన్స్ భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సరసన చేరాడు.
Also Read: IND vs AUS: రోహిత్ శర్మ ఔటయ్యాక పాట్ కమిన్స్ సంబరాలు.. మైదానంలో పరుగెత్తుతూ.. వీడియో వైరల్
టెస్టు క్రికెట్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తన బౌలింగ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేయడం ఇది నాల్గోసారి. దీంతో టెస్టు ఫార్మాట్ లో కెప్టెన్ గా ప్రత్యర్థి కెప్టెన్ ను ఎక్కువసార్లు అవుట్ చేసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ చేరాడు. గతంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లియోడ్ ను టెస్టుల్లో నాలుగు సార్లు అవుట్ చేశాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో రిచీ బెనాడ్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్) ఉన్నాడు. రిచీ బెనాడ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ టెడ్ డెక్స్‌టర్ ను ఐదు సార్లు ఔట్ చేశాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ను ఐదు సార్లు ఔట్ చేశాడు.
Also Read: IND vs AUS: క్యాచ్ వదిలేసిన స్మిత్.. కేఎల్ రాహుల్ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్
టెస్టుల్లో అత్యధిక సార్లు ప్రత్యర్థి కెప్టెన్లను అవుట్ చేసిన కెప్టెన్లు ..
రిచీ బెనాడ్ – టెడ్ డెక్సర్ (ఐదు సార్లు)
ఇమ్రాన్ ఖాన్ – సునీల్ గవాస్కర్ (ఐదు సార్లు)
రిచీ బెనాడ్ – గుల్రాబాయ్ రాంచంద్ (నాలుగు సార్లు)
కపిల్ దేవ్ – క్లైవ్ లాయిడ్ (నాలుగు సార్లు)
రిచీ బెనాడ్, పీటర్ మే (నాలుగు సార్లు),
పాట్ కమిన్స్, రోహిత్ శర్మ (నాలుగు సార్లు)
Pat Cummins is that fired up after getting Rohit Sharma!#AUSvIND | #OhWhatAFeeling | @Toyota_Aus pic.twitter.com/dZImJlva2I
— cricket.com.au (@cricketcomau) December 17, 2024