IND vs AUS: రోహిత్ శర్మ ఔటయ్యాక పాట్ కమిన్స్ సంబరాలు.. మైదానంలో పరుగెత్తుతూ.. వీడియో వైరల్

రోహిత్ శర్మ పరుగులు రాబట్టడంలో వరుసగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా.. భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లోనూ..

IND vs AUS: రోహిత్ శర్మ ఔటయ్యాక పాట్ కమిన్స్ సంబరాలు.. మైదానంలో పరుగెత్తుతూ.. వీడియో వైరల్

Rohit Sharma

Updated On : December 17, 2024 / 8:26 AM IST

Rohit Sharma: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ఆలో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. భారత్ జట్టు మూడో రోజు ఆట పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. నాల్గోరోజు (మంగళవారం) ఆట ప్రారంభం కాగా.. క్రీజులోకి కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వచ్చారు. అయితే, కొద్దిసేపటికే పాట్ కమిన్స్ బౌలింగ్ లో రోహిత్ శర్మ (10) పెవిలియన్ బాటపట్టాడు. రోహిత్ ఔట్ కావడంతో పాట్ కమిన్స్ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: IND vs AUS: క్యాచ్ వదిలేసిన స్మిత్.. కేఎల్ రాహుల్ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

మరోవైపు.. రోహిత్ శర్మ పరుగులు రాబట్టడంలో వరుసగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా.. భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 23 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 15 బంతులు ఆడి కేవలం ఆరు పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. తాజాగా మూడో టెస్టులోని తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ కేవలం 10 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో వరుసగా మూడు ఇన్నింగ్స్ ల్లో రోహిత్ పరుగులు రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో రోహిత్ ఆటతీరుపై టీమిండియా ప్యాన్స్ మండిపడుతున్నారు.

Also Read: AUS vs IND : ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. ఆకాశ్‌దీప్‌పై రోహిత్ శర్మ ఫైర్.. వీడియో వైరల్

గతంలో జరిగిన మ్యాచ్ లలో రోహిత్ శర్మ ఓపెనర్ గా క్రీజులోకి వచ్చేవాడు. ప్రస్తుతం గత రెండు టెస్టుల్లో ఐదు లేదా ఆరు స్థానాల్లో రోహిత్ క్రీజులోకి వస్తున్నాడు. అయితే, ఈ స్థానాల్లో పరుగులు రాబట్టడంలో అతను విఫలం అవుతున్నాడు. దీంతో రోహిత్ శర్మను ఓపెనర్ గానే బరిలోకి దింపాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.