ICICI Credit Card Rules : ICICI కస్టమర్లకు బిగ్ షాక్.. ఫిబ్రవరి 1 నుంచే క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. ఇకపై ఫ్రీ కాదు.. అన్ని ఛార్జీలే..!
ICICI Credit Card Rules : ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్ల కోసం కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ కీలక మార్పులు ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.
ICICI Credit Card Rules (Image Credit : AI )
- ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి
- ఫ్రీ మూవీ టికెట్లు, రివార్డు పాయింట్లు పొందలేరు
ICICI Credit Card Rules : ఐసీఐసీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. క్రెడిట్ కార్డుల వినియోగంపై అనేక కీలక మార్పులను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మార్పులు ముఖ్యంగా మూవీ టిక్కెట్లు, రవాణా, ఇన్సూరెన్స్, ఆన్లైన్ గేమింగ్ వ్యాలెట్ రీఛార్జ్‌లపై క్రెడిట్ కార్డు వాడే యూజర్లపై ప్రభావం పడుతుంది. అయినా కొన్ని కార్డు బెనిఫిట్స్ అలానే ఉంటాయి. ఇంతకీ ఏయే ఫీచర్లు నిలిచిపోనున్నాయి? ఛార్జీలు ఎంత పెరగనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బుక్‌మైషోలో ఫ్రీ మూవీ టిక్కెట్లు బంద్ :
ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కాంప్లిమెంటరీ (BookMyShow) మూవీ బెనిఫిట్స్ ఫిబ్రవరి 1, 2026 నుంచి నిలిపివేయనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ క్రెడిట్ కార్డులపై ఈ ఫీచర్ ఇక కనిపించదు.
ఐసీఐసీఐ ఇన్స్టంట్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ :
ఇప్పుడు, ఈ ఐసీఐసీఐ ఇన్స్టంట్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డులపై సినిమా టిక్కెట్లను తీసుకుంటే గతంలో మాదిరిగా ఫ్రీ లేదా డిస్కౌంట్లను పొందలేరు.
రివార్డ్ పాయింట్లలో మార్పులు :
క్యాబ్‌లు, మెట్రో, రైల్వేలు, ఇతర ట్రాన్స్ పోర్టేషన్ కోసం క్రెడిట్ కార్డులను వాడే కస్టమర్లకు బ్యాంక్ కొత్త లిమిట్స్ విధించింది. రూబిక్స్, సఫిరో ఎమరాల్డ్ వంటి ప్రీమియం కార్డులు నెలకు రూ. 20వేల వరకు రవాణా ఖర్చులపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చు.
Read Also : Apple iPhone 16e : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. ఐఫోన్ 16eపై ఏకంగా రూ. 11,500 తగ్గింపు.. ఇలా కొన్నారంటే?
రెగ్యులర్ మిడ్-సెగ్మెంట్ కార్డులు :
రవాణా ఖర్చులపై మీకు నెలకు రూ. 10వేల వరకు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. దీని కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే మాత్రం మీకు ఎలాంటి రివార్డు పాయింట్లు లభించవు.
ఇన్సూరెన్స్ పేమెంట్లపై రిలీఫ్ :
ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్పీఎసీఎల్ (HPCL) సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ రిలీఫ్ ఉంటుంది. గతంలో మాదిరిగానే రూ.40వేల వరకు బీమా ప్రీమియం చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు పెరుగుతూనే ఉంటాయి. ఈ కేటగిరీలో ఎలాంటి తగ్గింపు లేదు.
ఆన్లైన్ గేమింగ్‌కు ఇప్పుడు ఛార్జీలు :
మీరు డ్రీమ్11, ఎంపీఎల్, రమ్మీ కల్చర్ మొదలైన ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో డబ్బు డిపాజిట్ చేసేందుకు క్రెడిట్ కార్డ్‌ని వాడితే ఇప్పుడు భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 15, 2026 నుంచి ప్రతి లావాదేవీకి 2శాతం ఛార్జ్ వర్తిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా ఈ ఛార్జ్ వర్తిస్తుంది.
థర్డ్ పార్టీ వ్యాలెట్లలో డబ్బులు పంపుతున్నారా? :
ఇప్పుడు, క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేటీఎం, అమెజాన్ పే, ఫోన్ పే, మొబిక్విక్, ఫ్రీఛార్జ్, ఓలామనీ వంటి వ్యాలెట్లలో క్రెడిట్ కార్డు నుంచి డబ్బును లోడ్ చేస్తే కూడా భారీగా రుసుములు చెల్లించాల్సి వస్తుంది. రూ. 5వేలు లేదా అంతకంటే ఎక్కువ వ్యాలెట్ డిపాజిట్లకు ఒక శాతం రుసుము వర్తిస్తుంది.
ట్రాన్స్‌పోర్టుపై అధిక ఖర్చులకు రుసుములు :
ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఒక కస్టమర్ నెలలో రూ. 50వేల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే అదనపు మొత్తంపై ఒక శాతం ఛార్జీ విధిస్తుంది.
క్రెడిట్ కార్డుపై పాత బెనిఫిట్స్ ఒక్కొక్కటిగా బ్యాంకులు ఎత్తివేస్తున్నాయి. కొన్ని ఖర్చులకు రివార్డ్ పాయింట్లు పరిమితం చేశాయి. గేమింగ్ వంటి డిజిటల్, హై-రిస్క్ పేమెంట్లపై ఛార్జీలు పెరుగుతున్నాయి. మీరు క్రెడిట్ కార్డ్ యూజర్లు అయితే మీ కార్డ్ కొత్త నిబంధనలను ఓసారి చెక్ చేసుకోవడం బెటర్.
