Rohit Sharma: ఆస్ట్రేలియాతో సిరీస్ తరువాత టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. నిజమెంత?

మూడో టెస్టు నాల్గోరోజు ఆటలో రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. మ్యాచ్ లో భాగంగా ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ వేసిన బంతిని రోహిత్ పేలవమైన షాట్ తో ..

Rohit Sharma: ఆస్ట్రేలియాతో సిరీస్ తరువాత టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. నిజమెంత?

Rohit Sharma

Updated On : December 17, 2024 / 12:13 PM IST

Captain Rohit Sharma : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తికాగా.. మరో మూడు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు పేలవ ప్రదర్శనతో పీకల్లోతు కష్టాల్లో ఉంది. అయితే, తాజాగా క్రికెట్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఓ అంశంపై విస్తృతంగా చర్చజరుగుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికి ప్రధాన కారణం.. గబ్బా టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరును కారణంగా చూపుతున్నారు.

Also Read: IND vs AUS: రోహిత్ శర్మ ఔటయ్యాక పాట్ కమిన్స్ సంబరాలు.. మైదానంలో పరుగెత్తుతూ.. వీడియో వైరల్

మూడో టెస్టు నాల్గోరోజు ఆటలో రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. మ్యాచ్ లో భాగంగా ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ వేసిన బంతిని రోహిత్ పేలవమైన షాట్ కొట్టి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రోహిత్ తన గ్లౌజ్ లను డగౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో టెస్టు కెరీర్ కు రోహిత్ ముగింపు పలకబోతున్నాడని నెట్టింట్లో విస్తృత చర్చ జరుగుతుంది. వాస్తవానికి గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేక పోతున్నారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్టులో రోహిత్ ఆడలేదు. ఈ క్రమంలో జస్ర్పీత్ బుమ్రా సారథ్యంలో ఆ టెస్టులో భారత్ జట్టు విజయం సాధించింది. రెండో టెస్టులో తిరిగి రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. ఆ టెస్టులో భారత్ జట్టు ఓడిపోయింది. రోహిత్ సైతం రెండు ఇన్నింగ్స్ లోనూ సింగిల్ డిజిట్ పరుగులకే అవుట్ అయ్యాడు. తాజాగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లోనూ రోహిత్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నా కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు. ఈ క్రమంలో రోహిత్ తీవ్ర అసంతృప్తితో తన గ్లౌజ్ లను డగౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు.

Also Read: IND vs AUS: క్యాచ్ వదిలేసిన స్మిత్.. కేఎల్ రాహుల్ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో విజయం తరువాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ ఫార్మాట్ లలో కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. వన్డేల్లోనూ ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత రోహిత్ వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతుంది. అయితే, టెస్టు ఫార్మాట్ లో మాత్రం కొంతకాలం కొనసాగాలని రోహిత్ తొలుత భావించాడట. కానీ, ప్రస్తుతం పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్న రోహిత్ శర్మ.. బోర్డర్ గావస్కర్ ట్రోపీ తరువాత టెస్టు ఫార్మాట్ నుంచిసైతం వైదొలబోతున్నాడని, ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు టీమిండియా వెళ్తే ఆ మ్యాచ్ తరువాత టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడం ఖాయమని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. మరి రోహిత్ శర్మ తాజా ప్రచారంపై ఎలా స్పందిస్తాడు.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడనే అంశం ఆసక్తికరంగా మారింది.