Rinku Singh : రింకూ సింగ్‌కు పిలుపు.. జట్లను ప్రకటించిన బీసీసీఐ
దులీప్ ట్రోఫీ 2024 రెండో రౌండ్ మ్యాచులు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 10, 2024 / 04:20 PM IST
Rinku Singh Picked For Duleep Trophy
Rinku Singh – Duleep Trophy : దులీప్ ట్రోఫీ 2024 రెండో రౌండ్ మ్యాచులు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు రోహిత్ శర్మ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టెస్టుకు ఎంపిక అయిన ఆటగాళ్లు తమ తమ జట్లను వీడనున్నారు.
ఈ నేపథ్యంలో ఆయా ఆటగాళ్ల స్థానాల్లో మరికొందరు ప్లేయర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ జాబితాలో రింకూ సింగ్ సైతం ఉన్నాడు. కాగా.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైనప్పటికి సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచులు ఆడతాడని తెలిపింది.
Suryakumar Yadav : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బంగ్లాతో టీ20 సిరీస్‌కు సూర్య!
గిల్ స్థానంలో ప్రథమ్ సింగ్, కేఎల్ రాహుల్ స్థానంలో అక్షయ్ వాడ్కర్, జురెల్ స్థానంలో ఎస్కే రషీద్ ని సెలెక్టర్లు ఎంపిక చేశారు . కుల్దీప్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ షామ్స్ ములానీ జట్టులోకి రాగా, ఆకాష్దీప్ స్థానంలో ఆకిబ్ ఖాన్ ఎంపిక అయ్యాడు. మయాంక్ అగర్వాల్ ఇండియా-ఏకి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌ల స్థానాలను సుయాష్ ప్రభుదేశాయ్, రింకూ సింగ్‌తో సెలెక్టర్లు భర్తీ చేశారు. అక్షర్ పటేల్ స్థానంలో నిశాంత్ సింధు ని ఎంపిక చేశారు.
అప్డేట్ చేయబడిన తరువాత జట్లు ఇవే..
ఇండియా-ఏ జట్టు : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, కుమార్ కుషాగ్రా, శాశ్వత్ రావత్, ప్రథమ్ సింగ్, అక్షయ్ వాడ్కర్, ఎస్కే రషీద్, ఆకిబ్ ఖాన్.
ఇండియా-బి జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేస్ సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్).
ఇండియా-సి జట్టు : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.
ఇండియా-డి జట్టు : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యష్ దూబే, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, సరాంశ్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, ఆకాష్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), సౌరబ్ కుమార్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విద్వాత్ కవేరప్ప.
